ప్రముఖ హీరోని... కాలితో ఎగిరి తన్నిన గుర్తుతెలియని వ్యక్తి

అక్కడ ఆర్నాల్డ్‌ అభిమానులతో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్‌తో స్నాప్‌చాట్‌ వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు. ఇంతలో .ఓ వ్యక్తి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్నాల్డ్‌ను కాలితో ఎగిరి తన్ని కిందపడిపోయాడు.

news18-telugu
Updated: May 19, 2019, 12:31 PM IST
ప్రముఖ హీరోని... కాలితో ఎగిరి తన్నిన గుర్తుతెలియని వ్యక్తి
హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌‌కు చేదు అనుభవం
  • Share this:
ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలకు పబ్లిక్‌లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.రాజకీయ ప్రముఖులతో పాటు.. సినీ సెలబ్రిటీలపై కూడా జనం దాడులు చేయడం సర్వ సాధారణమైపోయాయి. తాజాగా ఓ హీరో పబ్లిక్‌లో ఉన్నప్పుడు.. అతనిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. అదికూడా మామూలుగా కాదు. వెనకాల నుంచి వచ్చి ఎగిరి హీరోను కాలితో తన్నాడు. ఆ వెంటనే కిందపడిపోయాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న సిబ్బంది వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని పట్టుకున్నారు. ఈ చేదు అనుభవం ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ (టెర్మినేటర్‌)కు ఎదురైంది. దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో శనివారం ఆర్నాల్డ్‌ 'క్లాసిక్‌ ఆఫ్రికా' పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో అక్కడ ఆర్నాల్డ్‌ అభిమానులతో సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్‌తో స్నాప్‌చాట్‌ వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు. ఇంతలో .ఓ వ్యక్తి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్నాల్డ్‌ను కాలితో ఎగిరి తన్ని కిందపడిపోయాడు. దాంతో అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే దాడికి దిగిన వ్యక్తిని అక్కడి నుంచి లాక్కుపోయారు.

ఇప్పుడీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆర్నాల్డ్ కూడా స్పందించాడు. తనపై జరిగిన దాడిని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. తనను ఎవరో బలంగా తన్నారన్న విషయం ఈ వీడియో చూస్తే కానీ తెలియలేదంటూ పోస్టు పెట్టాడు. ఆ ఇడియట్‌ నా స్నాప్‌చాట్‌ వీడియోను పాడుచేయనందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్లు చేశాడు ఆర్నాల్డ్.అయితే ఇంతకు ఆర్నాల్డ్‌పై ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడో మాత్రం ఇంకా తెలియలేదు. యాక్షన్ సినిమాలతో ఆర్నాల్డ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.టెర్నినేటర్, ప్రిడేటర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు. 1947 జూలై 30న జన్మించిన ఆర్నాల్డ్ వయసు ప్రస్తుతం 70 ఏళ్లకు పైనే.

Published by: Sulthana Begum Shaik
First published: May 19, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading