Home /News /international /

ARMED MAN TAKES HOSTAGES AT LEBANON CAPITAL BEIRUT BANK DEMANDING RETURN OF FROZEN FUNDS PVN

నా సేవింగ్స్ అకౌంట్ డబ్బులు ఇస్తారా? ఇవ్వరా? బ్యాంకు ఉద్యోగులను ’కిడ్నాప్‘ చేసిన కస్టమర్

బ్యాంక్ లో సాయుధుడు

బ్యాంక్ లో సాయుధుడు

Man takes hostages at bank:లెబనాన్(Lebanon)రాజధాని బీరుట్(Beirut)లో ఓ వ్యక్తి మారణాయుధాలతో బ్యాంకులోకి చొరబడి బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లను బందీలు(Hostages)గా ఉంచాడు. బ్యాంక్ స్తంభింపచేసిన తన సేవింగ్స్ అకౌంట్(Savings Account) లోని అమౌంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 42 ఏళ్ల బస్సామ్ అల్-షేక్ హుస్సేన్ షాట్‌గన్, పెట్రోల్ డబ్బాతో గురువారం బీరుట్‌లోని హమ్రా వీధిలోని ఒక బ్యాంకులోకి చొరబడి.. ఉద్యోగులు, కస్టమర్లను బందీలుగా ఉంచాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Man takes hostages at bank:లెబనాన్(Lebanon)రాజధాని బీరుట్(Beirut)లో ఓ వ్యక్తి మారణాయుధాలతో బ్యాంకులోకి చొరబడి బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లను బందీలు(Hostages)గా ఉంచాడు. బ్యాంక్ స్తంభింపచేసిన తన సేవింగ్స్ అకౌంట్(Savings Account) లోని అమౌంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 42 ఏళ్ల బస్సామ్ అల్-షేక్ హుస్సేన్ షాట్‌గన్, పెట్రోల్ డబ్బాతో గురువారం బీరుట్‌లోని హమ్రా వీధిలోని ఒక బ్యాంకులోకి చొరబడి.. ఉద్యోగులు, కస్టమర్లను బందీలుగా ఉంచాడు. తన తండ్రి ఆపరేషన్ కోసం తనకు నిధులు అవసరమని, స్తంభింపచేసిన తన సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బులని తీసుకోవడానికి అనుమతించకపోతే బ్యాంకును తగలబెడతానని, బ్యాంకులోని ప్రతి ఒక్కరినీ చంపేస్తానని బెదిరించాడు. కొన్ని గంటల ప్రతిష్టంభన తర్వాత అల్-షేక్ హుస్సేన్.. తన బ్యాంకు ఖాతాలో కొంత భాగాన్ని తీసుకునేందుకు హామీ లభించిన తర్వాత భద్రతా దళాలకు లొంగిపోయాడు.

అల్-షేక్ హుస్సేన్ బ్యాంకు ఖాతాలో 2,10,000 డాలర్లు ఉండగా...30,000 డాలర్లు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించడంతో అతడు భద్రతా దళాలకు లొంగిపోయాడు. కాగా,బ్యాంకులో ఉన్న సమయంలో అల్-షేక్ హుస్సేన్ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో..రైఫిల్ పట్టుకున్నఅల్-షేక్ హుస్సేన్ నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి...నాకు చాలా సమయం లేదు అని గట్టిగా అరవడం కనిపించింది. మరోవైపు,బందీగా తీసుకున్న వ్యక్తికి అతడి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు వెలుపల అనేక మంది ప్రజలు గుమిగూడారు. బందీలుగా ఉన్నవారి మద్దతుదారులు చాలా మంది ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులు భద్రతా బలగాలపై వాటర్ బాటిళ్లను విసిరారు.

Haqqani : తాలిబన్లకు భారీ షాక్..హక్కానీని హత్య చేసిన ఐసిస్!

గంటల కొద్దీ చర్చల తర్వాత, హుస్సేన్ తన పొదుపులో కొంత భాగాన్ని స్వీకరించడానికి బ్యాంక్ నుండి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించినట్లు స్థానిక మీడియా,చర్చలలో పాల్గొన్న డిపాజిటర్ల బృందం తెలిపింది. అనంతరం బందీలను విడిచిపెట్టి లొంగిపోయాడు. చర్చల్లో పాల్గొన్న న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం అతనికి ఎలాంటి డబ్బు అందలేదు.



కాగా,లెబనాన్ అక్టోబరు 2019లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. దేశ జనాభాలో మూడొంతుల మందికి పైగా పేదరికంలో ఉన్నారు. ఆర్థిక సంక్షోభం నాటి నుంచి దేశం యొక్క బ్యాంకింగ్ రంగం.. ప్రజలు వారి అకౌంట్ల నుంచి వారి డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధిస్తోంది. గురువారం లెబనీస్ డిపాజిటర్స్ అసోసియేషన్ అధిపతి, హసన్ ముగ్నియే బందీలను విడుదల చేయడానికి చర్చలు జరిపే ప్రయత్నంలో బ్యాంక్‌లోకి ప్రవేశించాడు, కానీ అల్-షేక్ హుస్సేన్ ఆ సమయంలో రెండు సార్లు కాల్పులు జరిపాడు. "ఈ పరిస్థితికి లెబనాన్‌లోని అధికార పార్టీ, బ్యాంకింగ్ సంస్థలదే బాధ్యత" అని ముగ్నియే చెప్పారు. సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే, పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bank account, Crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు