అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ సెంటర్ మీద దాడి చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్ సెంటర్లో కౌంటింగ్ కేంద్రం మీద దాడి చేయడానికి ప్రయత్నించాడన్న అనుమానంతో ఫిలడెల్ఫియాలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్ కథనం ప్రకారం గురువారం రాత్రి (స్థానిక కాలమానం) ఇంకా కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపింది. ఓ గుంపు వర్జీనియా నుంచి వస్తున్నారని, కౌంటింగ్ సెంటర్ మీద దాడి చేయడానికి వారు ప్లాన్ చేశారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అన్ని వాహనాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తి వద్ద కారులో ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ అరెస్టు జరిగింది. పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు జరిగాయంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో 90 శాతం ఓట్లను లెక్కించారు. ట్రంప్ కొంచెం లీడ్లో ఉన్నారు. అత్యంత నిర్ణయాత్మకమైన ఈ రాష్ట్రంలో ట్రంప్, జో బైడెన్ మధ్య పోటాపోటీ ఉంది. సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రకారం ప్రస్తుతం జోబైడెన్ అధ్యక్ష పీఠానికి అతికొద్ది దూరంలో ఉన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.