వాడు మామూలోడు కాదు... లైవ్‌లో రిపోర్టర్ చేతిలో మొబైల్ ఎత్తుకుపోయిన దొంగ... వైరల్ వీడియో

Viral Video: ఎప్పుడైనా దొంగలు చోరీ చేయాలనుకున్నప్పుడు... అత్యంత జాగ్రత్తగా సీక్రెట్ గా చోరీ చేస్తుంటారు. ఆ దొంగ మాత్రం ఏ భయమూ లేకుండా అలా చేతిలో మొబైల్ ఎత్తుకుపోయాడు.

news18-telugu
Updated: October 26, 2020, 10:14 AM IST
వాడు మామూలోడు కాదు... లైవ్‌లో రిపోర్టర్ చేతిలో మొబైల్ ఎత్తుకుపోయిన దొంగ... వైరల్ వీడియో
వాడు మామూలోడు కాదు... లైవ్‌లో రిపోర్టర్ చేతిలో మొబైల్ ఎత్తుకుపోయిన దొంగ... వైరల్ వీడియో (credit - youtube)
  • Share this:
Viral Video: రెడీ.. రెడీ.. కెమెరా... యాక్షన్... అంటూ... ఆ అర్జెంటినా రిపోర్టర్... టీవీలో లైవ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ కెమెరామేన్... ఆ రిపోర్టర్‌ను రికార్డ్ చేస్తున్నాడు. రిపోర్టర్ ఓ చేతిలో... మైక్, మరో చేతిలో... మొబైల్ పట్టుకొని... రెడీగా ఉండగా... సడెన్‌గా రిపోర్టర్ దగ్గరకు వచ్చి... అతని చేతిలో... మొబైల్ అలా లాక్కొని... చటుక్కున్న పారిపోయాడు ఓ దొంగ. అసలు ఆ వచ్చిన వ్యక్తి చోరీ చేయబోతున్నాడని ఎవరు ఊహిస్తారు... రిపోర్టర్ కూడా ఊహించలేదు. సడెన్‌గా అలా జరిగే సరికి... రిపోర్టర్ షాక్ అయ్యాడు. "ఏయ్... ఏయ్... దొంగా... దొంగా..." అంటూ అతని వెనక పరుగెత్తాలని ట్రై చేశాడు. కానీ ఆ దొంగ... చిరుతలా పారిపోయాడు. క్షణాల్లో ఓ సందులోకి వెళ్లి... అటు నుంచి అటే మాయమయ్యాడు. అంతా లైవ్‌ కెమెరాలో రికార్డైంది.

ఈ ఘటనలో రిపోర్టర్ డీగో డెమార్కో కి బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన అనుభవం ఇప్పుడు వైరల్ అయ్యింది. అతను ఏదో న్యూస్ లైవ్ ఇద్దామనుకుంటే... ఇప్పుడీ చోరీ అసలైన న్యూస్ అయిపోయింది. చాలా మంది ఈ వీడియోని చూసి... ఆశ్చర్యపోతున్నారు. "ఏ జేబులోనో ఉన్న మొబైళ్లను కొట్టేయడం చూశాం... ఇలా చేతిలో ఉన్నవి కూడా పట్టుకుపోతున్నారా" అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.


అక్టోబర్ 20న ఈ దారుణం జరిగింది. చోరీ చేసిన దొంగ... కరోనా ఫేస్ మాస్క్ ధరించాడు. అందువల్ల అతను ఎవరు అన్నది తెలియలేదు. ఐతే... స్థానికులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎప్పుడైతే... దొంగ మొబైల్ తీసుకొని పారిపోతున్నాడో... ఆ సందులో ప్రజలు అతని వెంట అదే వేగంతో పరుగెత్తి పట్టుకున్నారు. ఎక్కడ తనను జైల్లో పెడతారో అనుకున్న దొంగ... ఆ మొబైల్ వాళ్లకు ఇచ్చి... పారిపోయాడు. దాంతో స్థానికులు కూడా ఇక అతన్ని వెంటాడటం మాని... ఆ మొబైల్‌ను తిరిగి డెమార్కోకి ఇచ్చారు. అలా... తన మొబైల్ తిరిగి తనకు దక్కిందని ఊపిరిపీల్చుకున్నాడు రిపోర్టర్.

స్మార్ట్ మొబైల్‌ను కొంత మంది ఎంతో స్మార్ట్‌గా పట్టుకుంటారు. మరికొంత మంది షర్ట్ జేబులో పైకి కనిపించేలా పెట్టుకుంటారు. అలాంటి వారు... ఇలాంటి దొంగలతో జాగ్రత్త పడాల్సిందే అని ఈ వీడియో హెచ్చరిస్తోంది. ఎందుకంటే... ఇలాంటి దొంగలు... ప్రపంచమంతా ఉన్నారు. రోజూ వేల కొద్దీ ఫోన్లు ఇండియాలో చోరీ అవుతున్నాయి. వాటిని వెతకడం కష్టం అవుతుంటే... పోలీసులు కూడా ఇలాంటి కేసులు నమోదు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. సో, మనమే మన మొబైల్ విషయంలో జాగ్రత్త పడాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చుట్టూ చూసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.
Published by: Krishna Kumar N
First published: October 26, 2020, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading