ఈజిప్టులో మరిన్ని మమ్మీలు... కుండలలో ఎందుకు దాచారు? పక్కనే ఉన్న ఆ జంతువులేంటి?

Egypt Mummification : శతాబ్దాలుగా ఈజిఫ్టులో మమ్మీలు దొరుకుతూనే ఉన్నాయి. ఒక్కో మమ్మీ ఒక్కో కొత్త కథ చెబుతోంది. తాజాగా ఓ స్మశాన వాటికే బయటపడింది. అందులో మమ్మీలతోపాటూ... జంతువుల కళేబరాలూ బయటపడ్డాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 3, 2019, 2:42 PM IST
ఈజిప్టులో మరిన్ని మమ్మీలు... కుండలలో ఎందుకు దాచారు? పక్కనే ఉన్న ఆ జంతువులేంటి?
ఈజిఫ్టు పిరమిడ్లు (Image: ANI/Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: February 3, 2019, 2:42 PM IST
ఈజిప్టులో పురాతత్వ శాస్త్రవేత్తలకు సరికొత్త ప్రశ్నలతో సవాల్ విసురుతోంది పురాతన స్మశానవాటిక. అందులో దాదాపు 50 మమ్మీలు బయటపడ్డాయి. వాటిలో 12 మంది చిన్నపిల్లల శవాల్ని దాచినట్లుగా తేల్చారు. ఈజిప్టులోని కైరోకి దక్షిణాన మిన్యా అనే ఓ ప్రదేశంలో తవ్వకాలు జరపగా... ఉన్నట్టుండి ఆ ప్రాంతం లోయలా మారింది. వెంటనే అక్కడ పూర్తిస్థాయి తవ్వకాలు జరిపారు. 29 అడుగుల లోతైన గదులను కనుక్కున్నారు. వాటిలో ఆ మమ్మీలున్నాయి. అవి క్రీస్తుపూర్వం 305 నాటి కాలం నాటివి కావచ్చని అంచనా వేశారు. మమ్మీలతోపాటూ... 6 జంతువుల కళేబరాలు కూడా స్మశానంలో కనిపించాయి. పెంపుడు జంతువులు చనిపోతే, వాటిని కూడా మమ్మి్ఫికేషన్ చేశారని తెలిసింది.

mummy, egypt, ancient egypt, egypt mummy, the mummy, egypt mummies, mummies, history of egypt, oldest mummy, egypt pyramid mummy, history of egypt mummies, egypt pyramids, secret of egypt mummy 2018, egypt facts, the mummy returns, secret of egypt mummy, mummification, pyramids of egypt, egyptian mummy, mummy in egypt, ఈజిఫ్టు మమ్మీ, మమ్మీల రహస్యం, ఈజిఫ్ట్ పిరమిడ్లు
ఈజిఫ్టు పిరమిడ్లు (Image: ANI/Twitter)


కొన్ని మమ్మీలపై అప్పటి భాషలో రాసిన విశేషాలున్నాయి. ఈజిప్షియన్‌ కాలంలో ఆ భాషను సాధారణ ప్రజలు మాట్లాడేవాళ్లని తెలిసింది. చిత్రమేంటంటే... చాలా మమ్మీలను కుండల్లో భద్ర పరిచారు. తద్వారా ఇప్పటివరకూ మనం ఊహించినట్లు బాక్సులలో కాకుండా... కుండల్లో కూడా మమ్మీలను దాచేవారని అర్థమైంది.

చనిపోయిన వాళ్లు ఆత్మ రూపంలో తిరిగి వస్తారనీ, తమ డెడ్‌బాడీ దగ్గర ఉంటారనీ ఈజిప్షియన్లు నమ్మేవారు. అందుకే చనిపోయిన వాళ్లను మమ్మిఫికేషిన్ చేసేవాళ్లు. ఒక్కో శవాన్ని మమ్మీగా మార్చడానికి 70 రోజులు పడుతుంది. మనిషి చనిపోయాక... శరీరంలో కుళ్లిపోయే అవయవాల్ని తొలగించి... కొన్ని లేపనాలు, సెంట్లను పోసేవారు. ఆ శవాన్ని తెల్లటి వస్త్రాలతో చుట్టేవారు. ఇలా 70 రోజులపాటూ ఎండిపోయే శవంలో నీరు మొత్తం ఇంకిపోయేది. దాన్ని బాక్సులో ఉంచి... సదరు వ్యక్తి వాడిన వస్తువుల్ని అందులో పెట్టి... పూడ్చిపెట్టేవారు.Video : యాదాద్రి పుణ్యక్షేత్రంలో కేసీఆర్
First published: February 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...