ANYONE TRYING TO BULLY US WILL FACE BLOODSHED XI JINPING WARNS FOREIGN ENEMIES SK
Xi Jinping: మా జోలికొస్తే రక్తపాతమే... వారికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘాటు హెచ్చరిక
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Image:Twitter)
చైనా ప్రజల నుంచి కమ్యూనిస్టు పార్టీని ఎవ్వరూ విడదీయలేరన్న జిన్‌పింగ్.. అలాంటి విచ్ఛిన్నకర శక్తుల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీని దెబ్బ తీయాలనుకునే వైరస్‌లను కూకటివేళ్లతో పెకిలిస్తామని తమ దేశంలోని ప్రత్యర్థులకు కూడా వార్నింగ్ ఇచ్చారు జిన్‌పింగ్.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. తమ శత్రు దేశాలను గట్టిగా హెచ్చరించారు. ఏదేశ సైన్యమైనా తమ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమతో పెట్టుకుంటే రక్తపు టేరులు పారిస్తామని.. తలలు పగులుతాయని వార్నింగ్ ఇచ్చారు. గురువారం బీజింగ్‌లోని టియానన్మెన్ స్వేర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీీసీపీ) వందేళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎంపి చేసిన 70వేల మంది ప్రేక్షకులకు మాత్రమే వేడుకలకు అనుమతించారు. ఈ కార్యక్రమానికి దేశాధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి, చైనా మిలటరీ అధినేత షి జిన్‌పింగ్ హాజరై ప్రసంగించారు. కమ్యూనిస్ట్ పిత మావో జెడాంగ్లా జింపింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు గంట పాటు మాట్లాడిన జిన్‌పింగ్.. కమ్యూనిస్ట్ పార్టీ ఆవశ్యకత, అంతర్గత అసమ్మతితో పాటు ఆర్థిక వ్యవస్థ, తైవాన్ అంశాలకు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
‘మేం చైనీయులం. మేం ఎవరి సైన్యాన్ని, శక్తిని చూసి భయపడం. మమ్మలి బెదించాలని.. అణచివేయాలని చూస్తే ఊరుకోం. ప్రత్యర్థుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకున్నాం. విదేశీ శక్తులు బెదిరించడానికి, అణచివేయడానికి లేదా బానిసలుగా చేయడానికి చైనా ప్రజలు ఎప్పటికీ అనుమతించరు. మమ్మల్ని ఎదరురించాలని ఎవరైనా చూస్తే 140 కోట్ల నిర్మించిన గ్రేట్ వాల్ ఉక్కు సంకల్పం ధాటికి తలల పగిలి రక్తపాతం ఎదుర్కోవాలి. తైవాన్ను చైనాలో భాగం చేయడం మా పార్టీ చారిత్రక లక్ష్యం. తైవాన్ మమ్మూటికీ మా భూభాగమే. మాతృభూమిని మళ్లీ పునరేకీరణ చేయాలి. చైనా ప్రజలు, తోటి పౌరులంతా కలిసి మెలిసి ఉండాలి. తైవాన్‌కు అండగా నిలబడాలి. ఎవరైనా తైవాన్ స్వాతంత్ర్యమంటూ వేర్పాటువాద గళమెత్తితే ఉక్కుపాదంతో అణచివేద్దాం.' అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
కమ్యూనిస్టు పార్టీయే చైనాకు రక్ష అని ఈ సందర్భంగా తెలిపారు జిన్‌పింగ్. కమ్యూనిటీ పార్టీ లేకుండా కొత్త చైనాను ఊహించలేమని.. దేశ విజయం కమ్యూనిటీ పార్టీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్టు పార్టీని ఎవ్వరూ విడదీయలేరన్న జిన్‌పింగ్.. అలాంటి విచ్ఛిన్నకర శక్తుల పప్పులు ఉడకవని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీని దెబ్బ తీయాలనుకునే వైరస్‌లను కూకటివేళ్లతో పెకిలిస్తామని తమ దేశంలోని ప్రత్యర్థులకు కూడా వార్నింగ్ ఇచ్చారు జిన్‌పింగ్. ఐతే ఈ ప్రసంగంలో పరోక్షంగా అమెరికాకే వార్నింగ్ ఇచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 1921 వేసవిలో షాంఘై వేదికగా మార్క్సిస్ట్-లెనినిస్ట్ వాదులు ఒకటిగా ఏర్పడి.. చైనా కమ్యూనిస్ట్ పార్టీని (సీసీపీ) స్థాపించారు. అది ప్రపంచంలోనే శక్తివంతమైన పార్టీల్లో ఒకటిగా మారింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.