అఫ్గనిస్థాన్ లో తమకు ఇక తిరుగులేదని భావిస్తున్న తాలిబన్లకు భారీ షాక్ తగలింది. వారిపై ప్రతిఘటన మొదలైంది. ఇప్పటికే ఉత్తర అఫ్గనిస్థాన్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి ఆఫ్గాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. పంజిషిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను ఆఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ వివరాలను ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్లో తెలిపారు. పంజిషీర్‌కు ఉత్తరాన బఘలాన్ ప్రావిన్సుల్లోని దేహ్ సలేహ్, బనో, పల్-హేసర్ జిల్లాలలో తాలిబన్లను ప్రతిఘటించి అక్కడ నుంచి వెళ్లగొట్టినట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దేశంలో తాలిబన్లను తిప్పికొట్టి, పంజ్‌షీర్ లోయలో ప్రతిఘటిస్తామని మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్, సోవియట్ వ్యతిరేక ముజాహిద్దీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కుమారుడు ప్రతిజ్ఞ చేశారు. ఆయన వెంట 6 వేల మందికిపైగా ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. Afghanistan | Afghan Refugee: ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చే శరణార్థులను అనుమతిస్తున్న 9 దేశాలివే..
ఇదిలా ఉంటే.. ముస్కాన్ అనే మహిళ అప్ఘానిస్తాన్ పోలీస్ విభాగంలో పనిచేశారు. దేశాని తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత.. వారి రాక్షస పాలనకు బయటపడి ఇండియాకు వచ్చారు. కాబూల్ నుంచి వచ్చి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. తాలిబన్ల పాలన ఎలా ఉంటుంది? వారి అరాచకాలు ఎలా ఉంటాయి? మహిళలను ఎలాంటి చిత్రహింసలకు గురిచేస్తారు? అనే వివరాలను న్యూస్18తో పంచుకున్నారు ముస్కాన్.
'' తాలిబన్ల ఆక్రమణ తర్వాత మాకు ఎన్నో హెచ్చరికలు వచ్చాయి. ఎవరైనా మహిళ ఒకవేళ ఉద్యోగం చేస్తే.. ఆమెకు , ఆమె ఫ్యామిలీకి ముప్పు పొంచి ఉన్నట్లే. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఇవ్వరు. ఆ తర్వాత చంపేయడమే. తుపాకులతో కాల్చేస్తారు. మహిళలను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి చంపేస్తారు. మరణించిన తర్వాత కూడ వదలరు. మృతదేహాలతోనూ శృంగారం జరుపుతారు. వారు బతికి ఉన్నారా? మరణించారా? అని కూడా చూడరు. క్రూరమృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ప్రతి కుటుంబం నుంచి వారికి మహిళలు కావాలి. నిన్న కూడా ఓ యువతిని ఎత్తుకెళ్లి చంపేశారు. అందుకే వారికి భయపడి ఉద్యోగాన్ని వదలిపెట్టి వచ్చేశాను.'' అని ముస్కాన్ పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.