ANTI APARTHEID HERO SOUTH AFRICAN ARCHBISHOP DESMOND TUTU DIES AGED 90 PM MODI OTHERS TRIBUTE MKS
Desmond Tutu : వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు టుటూ ఇకలేరు.. SA ఆర్చిబిషప్ మృతిపై pm modi విచారం
ఆర్చి బిషప్ టుటూ మృతిపై పీఎం మోదీ సంతాపం
నల్ల సూరీడు నెల్సన్ మండేలా సమకాలీకుడైన డెస్మండ్ టుటూ సౌతాఫ్రికా నల్ల జాతీయుల హక్కుల సాధన పోరాటంలో విశేష పాత్ర పోషించారు. ఇతర దేశాల్లోనూ జాతి వివక్ష ధోరణులకు వ్యతిరేకంగా గళమెత్తారు. మానవాళి సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తింపుగా 1984లో డెస్మండ్ టుటూకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, సౌతాఫ్రికా ఆర్చి బిషప్ డెస్మండ్ టుటూ ఇకలేరు. క్యాన్సర్ చికిత్స పొందిన ఆయన 90 ఏళ్ల వయసులో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జోహన్నెస్ బర్గ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బిషప్ టుటూ చనిపోయిన విషయాన్ని సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అధికారికంగా ప్రకటించారు. నల్ల సూరీడు నెల్సన్ మండేలా సమకాలీకుడైన డెస్మండ్ టుటూ సౌతాఫ్రికా నల్ల జాతీయుల హక్కుల సాధన పోరాటంలో విశేష పాత్ర పోషించారు. ఇతర దేశాల్లోనూ జాతి వివక్ష ధోరణులకు వ్యతిరేకంగా గళమెత్తారు. మానవాళి సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తింపుగా 1984లో డెస్మండ్ టుటూకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
ఆర్చి బిషప్ టుటూ మరణం దక్షిణాఫ్రికాకు తీరని లోటు అని అధ్యక్షుడు రమఫొసా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన టుటూ అజాత శత్రువుగా పేరుపొందారని, మెజార్టీ నల్లజాతి ప్రజలపై క్రూరమైన అణచివేత సాగించిన శ్వేతవర్ణ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారని రమఫోసా గుర్తుచేశారు.
క్రైస్తవ బిషప్ గా ఉంటూనే నెల్సన్ మండేలాతో కలిసి సుదీర్ఘ ఉద్యమాల్లో పాల్గొన్న డెస్మండ్ టుటూ.. ప్రపంచవ్యాప్తంగా జాతి అసమానతలకు వ్యతిరేకంగా తరచూ బహిరంగ ప్రదర్శనలు నిర్వహించేవారు. టూటూ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు 1997లో నిర్ధారణ అయింది. వ్యాధికి చికిత్స పొందిన ఆయన, 2015 నుంచి తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. భార్యతో కలిసి కేప్ టౌన్ శివారు రిటైర్మెంట్ కమ్యూనిటీలో నివసించేవారు. ఇటీవల అనారోగ్యం పెరగడంతో ఆయనను జోహాన్నెస్ బర్గ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.
సౌతాఫ్రికా ఆర్చి బిషప్ డెస్మండ్ టుటూ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఆర్చి బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటూ ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలకు మార్గదర్శక కాంతి. మానవ గౌరవం, సమానత్వంపై ఆయన చూపిన ప్రాధాన్యత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన మరణం నన్నెంతగానో బాధించింది. టులూ అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరు గాక.’అని ప్రధాని మోదీ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందిస్తూ.. ‘గురువు, స్నేహితుడు, నైతిక దిక్సూచిని కోల్పోయాను’అన్నారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో(2009లో) సౌతాఫ్రికా ఆర్చి బిషప్ డెస్మండ్ టుటూకు అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.