Home /News /international /

ANOTHER TWIST IN SRI LANKAS PRESIDENTIAL ELECTION IS MODI GOING TO TAKE UP THE POSITION OF SPEAKER SUGGESTED BY THE PRESIDENT OH LOOK UMG GH

Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. అధ్యక్ష స్థానంలో మోదీ సూచించిన వక్తి..? పూర్తి విశ్లేషణాత్మక కథనం..!!

  శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. అధ్యక్ష స్థానంలో మోదీ సూచించిన వక్తి పదవి చేపట్టబోతున్నాడా ? ఒ లుక్కెయండి!

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. అధ్యక్ష స్థానంలో మోదీ సూచించిన వక్తి పదవి చేపట్టబోతున్నాడా ? ఒ లుక్కెయండి!

శ్రీలంక(Sri Lanka)లో అధ్యక్ష ఎన్నికల్లో కొత్త శకం ప్రారంభంకానుంది. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస తెలిపారు. ప్రత్యర్థి పార్టీ SLPPకి చెందిన డల్లాస్ అలహప్పెరుమ అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ?

ఇంకా చదవండి ...
(DP SATISH, న్యూస్ 18)

శ్రీలంక(Sri Lanka)లో అధ్యక్ష ఎన్నికల్లో కొత్త శకం ప్రారంభంకానుంది. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస తెలిపారు. ప్రత్యర్థి పార్టీ SLPPకి చెందిన డల్లాస్ అలహప్పెరుమ అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆయన రాజకీయ చతురత ప్రదర్శించారు. 2019 జూన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi) శ్రీలంకను సందర్శించారు. అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పాలనలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సజిత్ ప్రేమదాసను మోదీని స్వాగతించడానికి పంపించారు. ఆ సమయంలో చాలా వార్తాపత్రికలు మొదటి పేజీలో మోదీకి స్వాగతం పలికిన సజిత్‌ ఫోటోను ప్రచురించాయి. దాంతోపాటు సజిత్‌ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారని.. ‘ఆయన ప్రెసిడెంట్ పదవి కోసం వేచి ఉన్నారా?’ అని హెడ్డింగ్‌తో ఆర్టికల్స్ రాశాయి.

ఆ సమయానికి సజిత్‌‌కు అధ్యక్ష పదవిపై ఆశ స్పష్టంగా కనిపించింది. 2019 నవంబర్ అధ్యక్ష ఎన్నికలలో ఈ పదవికి పోటీ పడేందుకు రణిల్‌ను పక్కకు నెట్టగలిగారు. కానీ శక్తివంతమైన రాజపక్స వంశాన్ని, వారి సింహళ జాతీయవాద కార్డును ఓడించలేకపోయారు. గోటబయ రాజపక్సే (Gotabaya Rajapaksa)చేతిలో సజిత్‌ ఓడిపోయారు. సొంత పార్టీ UNPలో చాలా మంది ఓటమిపాలయ్యారు. ఆయన ఓటమితో సంతోషించిన మొదటి వ్యక్తి యూఎన్‌పీ అధినేత రణిల్ విక్రమసింఘే అనడంలో సందేహం లేదు. అయితే ఎనిమిది నెలల తర్వాత, 2020 ఆగస్టులో UNP ప్రధానమంత్రి పదవికి తన పేరును ప్రతిపాదించకపోవడంతో సజిత్‌ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా SJB పార్టీని స్థాపించారు.

అయితే మళ్లీ రాజపక్సేల నేతృత్వంలో SLPP ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీతో వారి పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ 225 సభ్యుల శ్రీలంక పార్లమెంటులో సజిత్‌ సొంతంగా 54 సీట్లు గెలుచుకోగలిగారు. ఫలితంగా UNP, అతడి శత్రువైన విక్రమసింఘేను పూర్తిగా ఓడించేలా చేశారు. ఆ తర్వాత సజిత్‌ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ నాయకుడయ్యారు. హౌస్ లోపల, వెలుపల శక్తివంతమైన రాజపక్స వంశాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. అధ్యక్షుడు గోటబయకు వ్యతిరేకంగా 100 రోజులు పాటు జరిగిన నిరసనలు, అల్లర్లలో సజిత్‌ రాజకీయంగా సరైన ప్రకటనలు చేస్తూ, జాగ్రత్తగా తన కార్డులను ప్లే చేశారు. జనాదరణ లేని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రజల హక్కును సమర్థిస్తూ నిరంతరం ప్రజలలో కనిపించారు. ఎట్టకేలకు నేడు కింగ్‌మేకర్‌గా మారారు.

కింగ్ మేకర్ ఎలా అయ్యారు?
సజిత్‌ చివరి నిమిషంలో ప్రెసిడెంట్(President) రేసు నుంచి వైదొలగడం ద్వారా తన రాజకీయ చతురతను నిరూపించుకున్నారు. మాజీ SLPP మంత్రి డల్లాస్ అల్లపెరుమకు మద్దతు ఇవ్వడం, పార్టీ సీనియర్ నేత అయిన ప్రొఫెసర్ GL పీరీస్‌ దీన్ని ఆమోదించేలా చేయడం ద్వారా జాగ్రత్తగా వ్యవహరించారు. తాను రణిల్‌ను ఓడించి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవలేనని సజిత్‌‌కు స్వయంగా తెలుసు. రాష్ట్రపతి పదవికి మంచి SLPP నాయకుడికి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత ప్రధానమంత్రి పదవికి అర్హత పొందడం అతడి లక్ష్యంగా కనిపించింది. ఇలా చేయడం ద్వారా ఆయన తెలివిగా రాజపక్సే వంశం, విక్రమసింఘే ఘనతను మూలన పడేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, అధ్యక్ష రేసులో డల్లాస్ గెలిస్తే.. రాజ్యాంగాన్ని సవరించి ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని రద్దు చేసిన తర్వాత సజిత్‌ ప్రధానమంత్రి అవుతారు.

కుటుంబ నేపథ్యం
55 ఏళ్ల సజిత్‌ ప్రేమదాస ఒకప్పుడు శ్రీలంకలో అత్యంత భయంకరమైన, సంస్కరణవాదిగా పేరొందిన అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస కుమారుడు. అతడి తండ్రిని 1993 మే 1న కొలంబోలో LTTE ఆత్మాహుతి బాంబర్ హత్య చేశాడు. అప్పుడు సజిత్‌ వయసు కేవలం 25 సంవత్సరాలు. ఆ తర్వాత తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. సజిత్‌ ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, అతని తండ్రి ఆర్ ప్రేమదాస పేద నేపథ్యం ఉన్న, తక్కువ కులానికి చెందినవారు. సజిత్‌ తన తండ్రి నేపథ్యం గురించి తరచుగా మాట్లాడుతుంటారు, ముఖ్యంగా వెనుకబడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు ఓటర్లకు గుర్తు చేస్తూ ఉంటారు. సింహళ భాషలో శక్తివంతమైన వక్త అయిన సజిత్‌, ఇటీవలి సంవత్సరాలలో తన అవరోధాలన్నింటినీ అధిగమించినట్లు కనిపిస్తోంది. సజిత్‌ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో చదివారు. అతడు మంచి గిటారిస్ట్, వైల్డ్ లైఫ్ (Wild Life)ఫోటోగ్రాఫర్ కూడా. కొన్నిసార్లు తన అభిరుచుల కోసం రాజకీయాలను విస్మరించి విమర్శలకు తావిచ్చారు. సజిత్‌ 1999లో జలని ప్రేమదాసును పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు.

2019 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని కూడా SLPP ప్రచారానికి వాడుకుంది. ఇలాంటి పిల్లలు లేని వ్యక్తి దేశాన్ని నడపలేడని, ప్రజలను పట్టించుకోలేడని ఆ పార్టీ సజిత్‌‌ను టార్గెట్ చేసింది. అయితే ఇది తప్పుడు వాదన అని తాజాగా నిరూపితమైంది. సజిత్‌ పాతపార్టీలో చాలా కాలం విక్రమసింఘేను అధిగమించలేని వ్యక్తిగా కనిపించారు. అయితే గత మూడేళ్లలో ఆయన కొత్త ఎత్తుకు చేరుకున్నారు. హౌసింగ్ మంత్రిగా శ్రీలంక అంతటా నిరాశ్రయులైన లక్షలాది మందికి ఇళ్లను అందించిన ఘనత ఆయనది. ఎప్పుడూ అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేదు. ఇవి ఆయన పెద్ద విజయాలు.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


తండ్రిలా కాదు
సజిత్‌‌కు వారసత్వ ఘనత ఉంది. ఆయన తండ్రి శ్రీలంకలో అత్యంత వివాదాస్పద అధ్యక్షుడు. 30 సంవత్సరాలకు పైగా అధ్యక్షుడిగా పనిచేసిన JR జయవర్ధనేకు అనుచరుడిగా పనిచేసిన సీనియర్ ప్రేమదాసను సమానంగా ఇష్టపడేవారు, అసహ్యించుకునేవారు. అధికారం కోసం ఆయన క్రూరమైన విధానాలు అనుసరించారు. 1980ల చివరలో మార్క్సిస్ట్ JVP నేతృత్వంలోని సింహళీయుల తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. శ్రీలంకలో తమిళ ఆధిపత్యం ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాల నుంచి IPKF ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని బలవంతం చేశారు. అయితే 1990ల ప్రారంభంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించి, స్వేచ్ఛా వాణిజ్యం, ప్రత్యేక ఆర్థిక మండలిని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు.సజిత్‌ వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండేది. ఆయన సాదాసీదాగా మాట్లాడేవారు. చైనాతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ద్వేషించే తన తండ్రిలా కాకుండా, సజిత్‌ మన దేశంతో సన్నిహిత సంబంధాలను సమర్థించారు. ఇలా ఎన్నో విషయాల్లో రాజకీయ చతురతతో వ్యవహరించి చాలా కాలం పాటు ప్రజల అభిమానం చూరగొన్నారు. తాను పోరాడగలనని నిరూపించుకున్న ఆయన ఇప్పుడు శ్రీలంక రాజకీయాలను శాసించే కింగ్ మేకర్‌గా మారారు.
Published by:Mahesh
First published:

Tags: Gotabaya Rajapaksa, Inflation, International news, Sri Lanka Crisis

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు