కశ్మీర్ విషయంలో పాక్‌కు మరో షాక్..అసహనంలో ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో ఇస్లాం దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటిల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ విషయంలో ఇస్లాం దేశాలు తమతో కలిసి రాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 7, 2020, 9:54 AM IST
కశ్మీర్ విషయంలో పాక్‌కు మరో షాక్..అసహనంలో ఇమ్రాన్ ఖాన్
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో రద్దు చేయడం తెలిసిందే. దీనిపై నానా రాద్ధాంతం చేస్తున్న పాక్...ఇస్లాం దేశాలను ఏకం చేసి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కశ్మీర్ అంశంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) దేశాల విదేశాంగ మంత్రుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనను సౌదీ అరేబియా తోసిపుచ్చింది. ఈ మేరకు పాకిస్థాన్ దౌత్య అధికారులను ఉటంకిస్తూ డాన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓఐసీలో 57 ముస్లీం దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులో సౌదీ అరేబియా కీలక సభ్యత్వ దేశంగా ఉంది. ఓఐసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కశ్మీర్ విషయంలో తమ వాదనకు బలంకూడగట్టాలని ఇమ్రాన్ ఖాన్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. సౌదీ అరేబియా నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. కశ్మీర్ విషయంలో ఓఐసీ దేశాలు ఏకతాటిపైకి రాలేకపోతున్నాయని, ముక్తుకంఠంతో మాట్లాడలేకపోతున్నాయని, మన మధ్యే విబేధాలున్నాయని మలేషియా పర్యటనలో ఆయన వాపోయినట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు బాసటగా నిలిచేందుకు సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని ఇస్లాం దేశాలు కూడా సుముఖంగా లేదని తెలుస్తోంది. కశ్మీర్ విషయంలో ఓఐసీ దేశాలు ఏకతాటికి రాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్‌ తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం.

కశ్మీర్ విషయంలో పాక్‌కు బాసటగా నిలిచిన మలేషియాపై మోదీ సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉండడం తెలిసిందే. దీంతో ఆ దేశం నుంచి పామాయిల్ గింజల దిగుమతులకు భారీగా కోతపెట్టింది. భారత్ దెబ్బకు మలేషియా కూడా కశ్మీర్ విషయంలో తన స్వరాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.
Published by: Janardhan V
First published: February 7, 2020, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading