Home /News /international /

ANOTHER GAS EXPLOSION IN CHINA CAUSED 3 DEAD AND 30 INJURED INCIDENT AT LIAONING PROVINCE CAPITAL SHENYANG CITY MKS

China వీధి మొత్తం పేలిపోయింది -డ్రాగన్ దేశంలో అనూహ్య ఘటన-ఆస్తి, ప్రాణనష్టం -ఒళ్లు గగుర్పొడిచే Video

చైనాలో భారీ పేలుడు

చైనాలో భారీ పేలుడు

డ్రాగన్ దేశం చైనాలో భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రధాన నగరంలో ఏకంగా వీధివీధే తుడిచిపెట్టుకుపోయేంతటి శక్తిమంతమైన పేలుడు దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. ఐదు నెలల వ్యవధిలో రెండోసారి ఇలాంటి దుర్ఘటన జరగడం, ఆస్తి, ప్రాణనష్టం భారీగా ఉండటంతో కమ్యూనిస్టు సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అందిన వివరాలివి..

ఇంకా చదవండి ...
ఈశాన్య చైనాలో కిమ్ జోంగ్ దేశం ఉత్తరకొరియాను ఆనుకునే ఉండే లియోనింగ్ ప్రావిన్స్ రాజధాని నగరమైన షెన్‌యాంగ్‌ లో గురువారం ఉదయం ఘోర సంఘటన జరిగింది. షెన్‌యాంగ్‌ సిటీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని వీధి మొత్తం ధ్వంసమైపోయింది. ఓ రెస్టారెంట్ లో పైప్ లైన్ గ్యాస్ లీక్ కావడంతో శక్తిమంతమైన పేలుడు సంభవించి ఆ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ వీధిలో ఆ గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ ఉన్న చుట్టుపక్కల భవంతులు, వాహనాలు కూడా పేలిపోయాయి.

షెన్‌యాంగ్‌ సిటీలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం వల్ల సంభవించిన పేలుడులో ఇప్పటిదాకా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిపోయిన భవంతుల శిథిలాల కింద ఇంకొందరు చిక్కుకుపోయారు. పేలుడు జరిగిన వెంటనే పదుల 30 ఫైరిజన్లలో వందల మంది ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. షెన్‌యాంగ్‌ పేలుడులో మృతుల సంఖ్య పెరగొచ్చని స్థానిక మీడియా చెబుతోంది.



అచ్చం సినిమా సీన్ల మాదిరిగా ఒక్కో భవంతి పేలిపోతున్న దృశ్యాల తాలూకు వీడియో నెట్టింట వైరల్ అయింది. కారులోని కెమెరాల్లో రికార్డైన వీడియోలను నెటిజన్లు షేర్ చేశారు. చైనా అధికారిక మీడియా సైతం ఆ వీడియోలను ధృవీకరించింది.



చైనాలో ఇంత భారీ స్థాయిలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించడం గడిచిన ఐదు నెలల్లో రెండోసారి. గత జూన్ లో సెంట్రన్ చైనాలోనూ దాదాపు ఇదే తీరుగా గ్యాస్ లీకై పేలుడు జరగడంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనలో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవంతులు కూలిపోయాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది.
Published by:Madhu Kota
First published:

Tags: China, Gas blast

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు