Home /News /international /

శ్రీలంకలో పేలిన 11వ బాంబు.... ఈసారి కోర్టు వెనక...

శ్రీలంకలో పేలిన 11వ బాంబు.... ఈసారి కోర్టు వెనక...

శ్రీలంకలో ఓ దృశ్యం (File)

శ్రీలంకలో ఓ దృశ్యం (File)

Sri Lanka Blast : శ్రీలంకలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఎంత టైట్ సెక్యూరిటీ పెట్టినా... బాంబులు పేలుతూనే ఉన్నాయి.

శ్రీలంక వాసులు కంటిమీద కునుకు లేకుండా బతుకుతుంటే... వాళ్లను మరింత భయపెడుతున్నాయి ఒక్కొక్కటిగా పేలుతున్న బాంబులు. తాజాగా... రాజధాని కొలంబో దగ్గర్లో తూర్పు వైపున ఉన్న పగోడా పట్టణంలో ఇవాళ మరో పేలుడు జరిగింది. అక్కడి మేజిస్ట్రేట్ కోర్టు వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. లక్కీగా ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో... ఎలాంటి నష్టమూ జరగలేదు. కోర్టుకు వచ్చే వాళ్ల ప్రాణాలు తీసేందుకే ఆ బాంబును అక్కడ పెట్టారని పోలీసులు భావిస్తున్నారు. మొదట ఆదివారం 9 చోట్ల పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు... ఏప్రిల్ 24న మరో బాంబు అమర్చారు. సినిమా థియేటర్‌నే లక్ష్యంగా చేసుకుని... బాంబును సెట్ చేశారు. కొలంబోని సావోయ్‌ థియేటర్‌ దగ్గర్లో ఓ బైక్‌లో ఈ బాంబు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐతే... దాన్ని తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ బాంబు పేలిపోయింది. బైకు తుక్కు తుక్కైంది. నిజంగా అది పేలినప్పుడు ప్రజలు ఉండి ఉంటే... దాదాపు ఐదారుగురు చనిపోయేవారని పోలీసులు తెలిపారు.

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 359 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తరచూ బాంబులు పేలుతుండటంతో... మరిన్ని ఉగ్ర దాడులు జరగొచ్చన్న అంచనాలతో అణువణువూ గాలిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

విమాన శబ్దం తట్టుకోలేక బాలుడి మృతి... డాబా ఎక్కి... పైకి చూస్తూ...

బ్రిట్నీ స్పియర్స్‌కి ఏమైంది... ఫ్యాన్స్ కోసం పంపిన మెసేజ్‌లో ఏమందంటే...

ఎయిర్‌పోర్ట్‌లో వింత మహిళ... సూట్‌కేస్ తెరచి చూస్తే షాక్...

గురుదాస్‌పూర్ బరిలో సన్నీడియోల్... అప్‌సెట్ అయిన వినోద్ ఖన్నా భార్య కవిత... ఎందుకంటే...
First published:

Tags: Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism, World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు