• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • ANOTHER BLOW FOR TRUMP US SUPREME COURT REJECTS TRUMP ELECTION APPEAL ON PENNSYLVANIA SU KRS

Donald Trump: అయ్యో ట్రంప్.. మరోసారి ఆయనకు నిరాశే మిగిలింది

Donald Trump: అయ్యో ట్రంప్.. మరోసారి ఆయనకు నిరాశే మిగిలింది

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడి శ్వేతసౌధం వీడేందుకు నిరాకరిస్తున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

  • Share this:
    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడి శ్వేతసౌధం వీడేందుకు నిరాకరిస్తున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జనవరిలో అధికారాన్ని వీడేలోగా విశ్వప్రయత్నాలు చేసి అధ్యక్ష పీఠాన్ని అట్టిపెట్టుకోవాలన్న ఆయన ఆశకు మరోసారి అమెరికా సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కోర్టుకెళతానని ఫలితాల రోజే ప్రకటించిన ఆయన.. తన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులతో కూడా ఆ పని కూడా చేయిస్తున్నారు. పెన్సెల్వేనియాలో తాము ఓడిపోయేందుకు ఎన్నికల్లో జరిగిన అనివీతే కారణమని, ఆ రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లను, కార్యలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో మైక్ కెల్లీ పిటిషన్ వేశారు. అయితే ఆ ఆరోపణలు నిరాధారమని కోర్టు తేల్చేడయంతో ట్రంప్​కు మరో షాక్ తగిలింది. ట్రంప్ నియమించిన ముగ్గురు న్యాయమూర్తులతో పాటు మొత్తం తొమ్మది మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో అమెరికా పీఠంపై ఇంకా ఏదో మూల ఆశలు పెట్టుకున్న డొనాల్డ్​కు మరో శరాఘాతం ఎదురైంది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరుగగా.. ఫలితాలు ఐదో రోజుల్లోనే వచ్చాయి. ట్రంప్పై డెమొక్రట్ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ప్రజాతీర్పును అంగీకరించలేదు. ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూనే ఉన్నారు. వైట్ హౌస్ ను వీడేది లేదంటూ భీష్మించుకున్నారు. జనవరి వరకు అధికారం ఉండడంతో తనకు నచ్చని అధికారులను తొలగిస్తూనే ఉన్నారు.

    రక్షణ కార్యదర్శి, ఎన్నికల అధికారి ఇలా ఎంతో మందికి ఉద్వాసన పలికారు. మరోవైపు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ రిపబ్లికన్ అభ్యర్థులతో ఎక్కడికక్కడే కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు. దాదాపు వాటన్నింటినీ న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి. ఇందులో భాగంగానే కీలకమైన పెన్సెల్వేనియాలోనూ ట్రంప్​నకు ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్టోరల్ కార్యకలాపాలను బ్లాక్ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు కొట్టేసింది.
    Published by:Sumanth Kanukula
    First published: