హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

AUKUS Alliance: చైనాకు కౌంటర్‌గా అకూస్ కూటమి.. అగ్రరాజ్యంతో కలిసి ఆ రెండు దేశాలు..

AUKUS Alliance: చైనాకు కౌంటర్‌గా అకూస్ కూటమి.. అగ్రరాజ్యంతో కలిసి ఆ రెండు దేశాలు..

జో బైడెన్(ఫైల్ ఫొటో)

జో బైడెన్(ఫైల్ ఫొటో)

ఇటీవలి సంవత్సరాల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక శక్తిని, కార్యకలాపాలను పెంచడంతో పలు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆస్ట్రేలియా.. అమెరికా సాంకేతికత సాయంతో అణు శక్తిని కలిగిఉన్న జలాంతర్గాములను నిర్మిస్తోంది. ఈ మూడు దేశాలు కలిసి అకూస్ (AUKUS) అనే కూటమిని ఏర్పరిచాయి. కృత్రిమ మేధస్సు, సైబర్, క్వాంటం టెక్నాలజీస్ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దశాబ్దాల కాలంలో దేశాల మధ్య ఇది అతిపెద్ద రక్షణ భాగస్వామ్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక శక్తిని, కార్యకలాపాలను పెంచడంతో ఈ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, శ్రేయస్సును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నూతన భాగస్వామ్యం ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానికి బోరిస్ జాన్సన్(Boris Johnson), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్(Scott Morrison) సంయుక్త ప్రకటనలో తెలిపారు. తాజా ఒప్పందంతో గతంలో 12 అణు జలాంతర్గాములను నిర్మించడానికి 2016లో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా కుదుర్చుకున్న 50 బిలియన్ డాలర్ల డీల్ ముగిసిపోయింది.

IPL 2021: ఇండియా నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్దామని అనుకుంటున్నారా..? అయితే వీరికి మాత్రమే ఎంట్రీ..!


* అకూస్ అంటే ఏంటి?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడు దేశాల మధ్య ఏర్పడిన అతిపెద్ద రక్షణ భాగస్వామ్యం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా చాలా కాలంగా మిత్రదేశాలుగా ఉన్నప్పటికీ, అకూస్ వారి మధ్య రక్షణ సహకారాన్ని మరింత లోతుగా తీసుకెళ్లనుంది. ఈ ఒప్పందం సైనిక సామర్థ్యంపై దృష్టిపెట్టడమే కాకుండా న్యూజిలాండ్, కెనడాలతో ఫైవ్ ఐస్(Five eyes) ఇంటిలిజెన్స్ ను షేర్ చేస్తుంది. మూడు దేశాల నాయకులు ప్రత్యక్షంగా చైనా గురించి చెప్పలేదు. అయితే ప్రాంతీయ భద్రతా సవాళ్లు గణనీయంగా పెరిగాయని పరోక్షంగా ప్రస్తావించారు.

* అకూస్ బ్యాక్ గ్రౌండ్..

చైనా సైనిక సామర్థ్యం, దూకుడు ఇటీవల కాలంలో ప్రత్యర్థి దేశాలకు కునుకులేకుండా చేస్తోంది. మరో వైపు డ్రాగన్ దేశం కూడా దక్షిణ చైనా సముద్రం లాంటి వివాదాస్పద భూభాగాల్లో ఉద్రిక్తతలు పెరిగాయని ఆరోపించింది. ఇటీవల సంవత్సరాల్లో కోస్ట్ గార్డ్స్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పసిఫిక్ దీవుల్లో చైనా మౌలిక సదుపాయలపై పెట్టుబడి, ఆస్ట్రేలియా లాంటి దేశాలపై వివాదాస్పద వాణిజ్య ఆంక్షలను పెంచింది. దీంతో అమెరికా, ఆస్ట్రేలియాలు ఈ చర్యను ఆర్థిక బలవంతంగా అభివర్ణించాయి.

Saidabad Rape Case: పక్కింట్లో ఉండే పాపపై అత్యాచారం, హత్య చేసి పరార్.. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?


* అణుశక్తితో నడితే జలాంతర్గాములు ఎందుకు?

ఈ సబ్ మెరైన్లు సంప్రదాయంగా నడిచే వాటికంటే చాలా వేగంగా ఉంటాయి. వీటిని గుర్తించడం కూడా కష్టం. ఫలితంగా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. మరింత సరుకు తీసుకెళ్లవచ్చు. ఆస్ట్రేలియాలోనే వీటిని ఉంచడం అమెరికాకు కీలకమని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా గత 50 ఏళ్ల కాలంలో తన సబ్ మెరైన్ సాంకేతికతను వేరే దేశానికి పంచుకోవడం ఇదే మొదటి సారి. గతంలో యూకేతో మాత్రమే ఈ టెక్నాలజీని షేర్ చేసింది. యూఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, రష్యా తర్వాత ప్రపంచంలో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆపరేట్ చేస్తున్న ఏడో దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది. అయితే అణ్వాయుధాలను పొందే ఉద్దేశం తమకు లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.

ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలపై ప్రభావం పడనుంది. ఒకటి ఫ్రాన్స్ కాగా.. మరోకటి చైనా. ఫ్రాన్స్ నాటోలో మిత్రదేశం. ఆస్ట్రేలియా నావికాదళం కోసం డీజిల్ ఎలక్ట్రిక్ సబ్ మెరైన్స్ నిర్మించడానికి ఆ దేశంతో ఆసీస్ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా అకూస్ డీల్ తో ఫ్రాన్స్ ఒప్పందం ముగిసిపోయింది. మరోవైపు ఈ నూతన రక్షణ ఒప్పందం చైనాకు విరుద్ధంగా లేదని యూకే నొక్కి చెప్పినప్పటికీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, శ్రేయస్సు, స్థిరత్వం లాంటి విషయంలో డ్రాగన్ పక్కలో బల్లెం మాదిరిగా తయారైంది. దీంతో చైనా కూడా ఎదురు వ్యూహాల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా సబ్ మెరైన్ తన జలాల నుంచి నిషేధించినట్లు బుధవారం వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Australia, China, Uk, USA

ఉత్తమ కథలు