అమెరికా హాలీడే ట్రిప్‌లో విషాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం

ప్రకాశం జిల్లాకు చెందిన నూనె సురేష్ తన కుటుంబం సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్ కి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు సురేష్ జలపాతంలో పడి చనిపోయారు.

news18-telugu
Updated: July 6, 2019, 9:24 PM IST
అమెరికా హాలీడే ట్రిప్‌లో విషాదం.. తెలుగు వ్యక్తి దుర్మరణం
కుటుంబ సభ్యులతో సురేష్ (File)
news18-telugu
Updated: July 6, 2019, 9:24 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా వాసి అమెరికాలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన నూనె సురేష్ తన కుటుంబం సమేతంగా ఒక్లహం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్ కి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు సురేష్ జలపాతంలో పడిపోయి చనిపోయినట్టు తెలిసింది. సురేష్‌కు
భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరు అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడి ఉద్యోగం నిర్వహిస్తున్నారు. సురేష్ సాఫ్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతడి డెడ్ బాడీ ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు. డెడ్ బాడీ తరలింపునకు దాదాపుగా 80 వేల డాలర్లు అవసరం కావటంతో.. బాధిత కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని సహాయం కోసం ఆర్థిస్తోంది. తమ బిడ్డ చివరి చూపులు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. సురేష్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోయుతున్నారు. ఇప్పటికే అమెరికాలోని సురేష్ సన్నిహితులు.. ఫండ్ రైజింగ్ కోసం వెబ్సైట్ ద్వారా సహాయం కోరుతున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. తెలుగు సంఘాలు, ప్రభుత్వం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా సురేష్ మృతదేహాన్ని ప్రకాశం జిల్లాలోని స్వగ్రామం తరలించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...