హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Thailand Artefacts: యముడి ఇసుక రాతి శిల్పాలకు థాయ్‌లాండ్ ఘన స్వాగతం.. వీటికి వెయ్యేళ్ల చరిత్ర

Thailand Artefacts: యముడి ఇసుక రాతి శిల్పాలకు థాయ్‌లాండ్ ఘన స్వాగతం.. వీటికి వెయ్యేళ్ల చరిత్ర

యముడి ఇసుక రాతి శిల్పాలకు థాయ్‌లాండ్ ఘన స్వాగతం (Image:AFP)

యముడి ఇసుక రాతి శిల్పాలకు థాయ్‌లాండ్ ఘన స్వాగతం (Image:AFP)

థాయ్‌లాండ్‌లో ఒకప్పుడు అనేక ఇసుక రాతి కళాఖండాలు ఉండేవి. అయితే 1950-60 మధ్యలో వీటిలో చాలా వరకు కనిపించకుండా పోయాయి. వియత్నాంతో జరిగిన యుద్ధం తరువాత వీటిని అక్రమంగా తరలించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

థాయ్‌లాండ్‌కు చెందిన పురాతన కళాఖండాలు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం దొంగతనానికి గురై, అమెరికాకు అక్రమంగా రవాణా అయిన రెండు పురాతన ఇసుక రాతి కళాకృతులకు అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. దీన్ని థాయ్‌లాండ్ ప్రభుత్వం ఒక ఉత్సవంలా నిర్వహించింది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ రాతి శిల్పాలను చేతితో చెక్కారు. వీటిపై యముడు, ఇంద్రుడుతో పాటు పలువురు హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి. ప్రాచీన చరిత్రలో భాగంగా ఉన్న ఈ శిల్పాలను అమెరికాకు అక్రమంగా స్మగ్లింగ్ చేశారు. ఆ తరువాత ఇవి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఆసియన్ ఆర్ట్స్ మ్యూజియానికి చేరాయి. అయితే ఈ ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వం వీటిని థాయిలాండ్‌కు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సుమారు 680 కిలోల బరువున్న రెండు ఇసుకరాతి కళాఖండాలను సోమవారం థాయ్‌లాండ్‌కు తరలించారు.

తమ చరిత్రలో భాగమైన ఈ రాతి శిల్పాలను తిరిగి అప్పగించాలని థాయ్‌లాండ్ 2017 నుంచి అమెరికాను కోరుతోంది. ఇవి 10 లేదా 11వ శతాబ్దానికి చెందినవని ఆ దేశ అధికారులు అమెరికాకు తెలిపారు. థాయ్‌లాండ్‌లో వీటిని దొంగిలించి, అమెరికాకు స్మగ్లింగ్ చేసినట్లు చెప్పారు. దీంతో కొన్ని సంవత్సరాల సంప్రదింపులు, సమాలోచనల తరువాత వీటికి ఇచ్చేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం అంగీకరించింది. స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ ప్రాచీన కళాఖండాలను మ్యూజియంలో భద్రపరుస్తామని చెబుతున్నారు థాయ్‌లాండ్ సంస్కృతిక శాఖ మంత్రి ఇత్తిఫోల్ కున్‌ప్లోమ్. బ్యాంకాక్‌లో ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

థాయ్‌లాండ్‌లో ఒకప్పుడు అనేక ఇసుక రాతి కళాఖండాలు ఉండేవి. అయితే 1950-60 మధ్యలో వీటిలో చాలా వరకు కనిపించకుండా పోయాయి. వియత్నాంతో జరిగిన యుద్ధం తరువాత వీటిని అక్రమంగా తరలించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పదో శతాబ్ధానికి చెందిన తాజా కళాఖండాలు కూడా అదే సమయంలో దొంగతనానికి గురైందని అధికారులు భావిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల మ్యూజియాల్లో సుమారు 140 వరకు థాయ్ కళాఖండాలు ఉన్నాయని థాయ్ అధికారులు చెబుతున్నారు. చట్టవిరుద్ధంగా సొంతం చేసుకున్న మ్యూజియంల నుంచి వాటిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు నిరాకరించే మ్యూజియంలపై చట్టపరంగా పోరాటం చేస్తామని ప్రకటించింది.

First published:

Tags: International news, Thailand

ఉత్తమ కథలు