అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. మూడు రోజు క్రితం కాబూల్ ఎయిర్‌పోర్టు బయట జరిగిన బాంబు పేలుళ్లను మరవక ముందే..మరోసారి ముష్కరులు రెచ్చిపోయారు. మళ్లీ బాంబు దాడితో విరుచుకుపడ్డారు. ఖవాజా బఘ్రాలోని గులాయి ప్రాంతంలో ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లుగా అప్ఘానిస్తాన్‌కు చెందిన అస్వాకా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ ఇద్దరు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. దీని వెనక ఐసిస్ (ISIS) ఉగ్రవాద సంస్థ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబూల్‌లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనికులను లక్ష్యంగా రాకెట్లతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
Explosion heard in Afghanistan's capital Kabul, reports local media
— ANI (@ANI) August 29, 2021
ఒక ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు శబ్ధం వినగానే చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో కొందరు స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear pic.twitter.com/wFdhCkHSwn
— ELINT News (@ELINTNews) August 29, 2021
First Footage - Kabul explosion, Khawaja Bughra, PD15 pic.twitter.com/ioG4PTI6uB
— Muslim Shirzad (@MuslimShirzad) August 29, 2021
#Breaking: An explosion was heard in #Kabul. Witnesses say the blast was caused by a rocket hitting a residential house in the Gulai area of Khajeh Baghra, in the 11th security district. There are no reports of casualties in this incident yet. pic.twitter.com/80vpRjlokk
— Aśvaka - آسواکا News Agency (@AsvakaNews) August 29, 2021
Afghanistan: కాబూల్‌లో మళ్లీ ఉగ్రదాడి... అమెరికా హెచ్చరిక
రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌లో మరో ఉగ్రదాడి జరగవచ్చని ఇది వరకే అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే. కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడే అవకాశముందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం లభించిందని.. సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే కాబూల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని అక్కడి ప్రజలకు అమెరికా సైన్యం హెచ్చరికలు పంపింది. అమెరికా అనుమానించినట్లుగానే.. బైడెన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కాబూల్‌లో బాంబు దాడి జరిగింది.
Afghanistan: కాబూల్ ఎయిర్‌పోర్టు చుట్టూ తాలిబన్లు.. తుపాకులతో పహారా..
కాగా, గురువారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్టులో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐసిస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు. దాదాపు ఏడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. మృతుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నారు. పేలుళ్లలో తమ సైనికులు మరణించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసిస్-కే ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శుక్రవారం రాత్రి ఐసిస్-కే స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడులకు పాల్పడింది అమెరికా. ఈ దాడుల్లో ఇద్దరు కీలక నేతలు హతమయినట్లు అమెరికా పెంటగాన్ కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.