హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఈలలు, బుల్లెట్ సౌండ్లు... మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి

ఈలలు, బుల్లెట్ సౌండ్లు... మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి

మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి (credit - twitter - Ketan Joshi)

మిమిక్రీతో ఆశ్చర్యపరుస్తున్న పక్షి (credit - twitter - Ketan Joshi)

Lyre Mimicry Bird : అరుదైన పక్షి జాతుల్లో ప్రత్యేకమైనది లైర్ బర్డ్. తాజాగా ఆస్ట్రేలియాలో కనిపించిన ఈ పక్షి... రకరకాలుగా మిమిక్రీ చేస్తూ... మన కళ్లతో మనమే నమ్మలేకుండా చేస్తోంది.

ఆస్ట్రేలియాలోని కొందరు రకరకాలుగా అరుస్తున్న లైర్ బర్డ్‌ని చూశారు. ఆశ్చర్యపోయారు. వెంటనే వీడియో తీసి... ఫేస్ బుక్‌లో పెట్టారు. ఈ పక్షి పేరు లైర్. అరుదైన పక్షి జాతి. శతాబ్దాలుగా ఈ జాతి పక్షులు ఇలా ఎలా మిమిక్రీ చెయ్యగలుగుతున్నాయన్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. సహజంగా ఏ పక్షి అయినా... రెండు మూడు రకాలుగా మాత్రమే అరవగలదు. ఈ పక్షి మాత్రం దాదాపు 30 రకాల శబ్దాలు చెయ్యగలదు. విజిల్స్ వెయ్యగలదు. బుల్లెట్ సౌండ్లు చెయ్యగలదు. కెమెరా షట్టర్, కార్ అలారం, లేజర్ కిరణాలు, గన్ ట్రిగ్గర్, మెషిన్ గన్‌ ఫైరింగ్, యుద్ధ ట్యాంకర్‌, టీవీ పాడైనట్లుగా... ఇలా రకరకాల సౌండ్లు చేస్తూ షాకిస్తుంది ఈ పక్షి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఈ పక్షి అరుపులు విని ఆనందపడుతున్నారు నెటిజన్లు.

ఫోర్ ఫింగర్స్ ఫొటోగ్రఫీ గ్రూప్... ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆస్ట్రేలియా... అడిలైడ్‌లోని అడిలైడ్ జూలో ఈ పక్షిని వీడియో తీశారు. ఈ వీడియోని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోని ఇప్పటికే 2లక్షల మందికి పైగా చూశారు. 5వేల మందికి పైగా లైక్ చేశారు. 2వేల మందికిపైగా కామెంట్లు కూడా చేశారు.

ఈ పక్షుల గొంతులో... సిరింక్స్ అనే స్వర ఆర్గాన్ ఉంటుంది. దాని వల్లే అవి రకరకాల శబ్దాలు చెయ్యగలుగుతున్నాయని పరిశోధకులు తేల్చారు.


Pics : ముద్గుగా... బొద్దుగా... ఆకట్టుకుంటున్న షాలిన్ జోయా


ఇవి కూడా చదవండి :

Dussehra 2019 : దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?

జబర్దస్త్ రష్మీ ప్లాన్ అదిరిందిగా... ఆ హీరోయిన్లకు చెక్

కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి... నేడు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనం

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

First published:

Tags: Australia, World