• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • AMULS LAUDS NEW ZEALANDS FIRST INDIAN ORIGIN MINISTER PRIYANCA RADHAKRISHNAN WITH INSPIRING DOODLE BA GH

Priyanca Radhakrishnan: న్యూజిలాండ్‌ మంత్రిగా భారతీయురాలు, ఎవరీ ప్రియాంకా రాధాకృష్ణన్?

Priyanca Radhakrishnan: న్యూజిలాండ్‌ మంత్రిగా భారతీయురాలు, ఎవరీ ప్రియాంకా రాధాకృష్ణన్?

ప్రియాంక రాధాకృష్ణన్ (Image; Twitter)

కేరళలోని ఎర్నాకులం సమీపాన గల పరపూర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్(41) న్యూజిలాండ్ కేబినెట్ మంత్రిగా ఎన్నికైంది.

  • Share this:
న్యూజిలాండ్లో భారత మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కేరళలోని ఎర్నాకులం సమీపాన గల పరపూర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్(41) న్యూజిలాండ్ కేబినెట్ మంత్రిగా ఎన్నికైంది. దీంతో న్యూజిల్యాండ్ దేశంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్ గుర్తింపు దక్కించుకుంది. 1979లో రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతులకు జన్మించిన ప్రియాంక రాధాకృష్ణన్ స్కూల్ విద్య అంతా సింగపూర్లో కొనసాగింది. ఆ తర్వాత వారి కుటుంబం న్యూజిలాండ్‌కు మారింది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి ఆక్లాండ్‌లో నివసిస్తోంది. కాగా, గత నెలలో న్యూజిలాండ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధానిగా ప్రధాని జసిందా అర్డెర్న్ తన మంత్రి వర్గంలో ఐదుగురు కొత్త మంత్రులకు చోటుకల్పించింది. వీరిలో భారత సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ ఉండటం విశేషం. గృహ హింసకు గురైన మహిళలు, దోపిడీకి గురైన వలస కార్మికుల తరఫున పోరాటాలు చేసిన ఆమె 2017 సెప్టెంబర్లో లేబర్ పార్టీ నుంచి తొలిసారి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత, 2019లో న్యూజిలాండ్ ఎథినిక్ కమ్యూనిటీ మంత్రికి పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్లమెంటరీ కార్యదర్శిగా అందించిన ఉత్తమ సేవలకు గాను జసిందా అర్డెర్న్ నూతన క్యాబినెట్లో చోటు దక్కించుకుంది. కాగా, జెసిండా క్యాబినెట్లో ఆమె కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో పాటు సామాజిక అభివృద్ధి, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేయనున్నారు. నూతన క్యాబినెట్ కూర్పుపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా మాట్లాడుతూ ‘‘మా క్యాబినెన్ను విభిన్నంగా తీర్చిదిద్దాం. ప్రతిభ, యోగ్యత కలిగిన వారికే నూతన మంత్రివర్గంలో చోటు కల్పించాం. ఇందుకు చాలా గర్వంగా ఉంది. రాబోయే మూడేళ్లు మేము సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరోనా సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంది. దీన్ని అధిగమించి త్వరలోనే కోలుకుంటామనే ఆశాభావంతో ఉన్నాం.” అని పేర్కొన్నారు.

అముల్ అరుదైన గౌరవం..
భారత సంతతికి చెందిన మహిళ తొలిసారి న్యూజిలాండ్ మంత్రిగా ఎన్నికవ్వడంతో ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ మెంబర్ శశి థరూర్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు.



ప్రముఖ డెయిరీ కంపెనీ అముల్ తమదైన శైలిలో గ్రాఫిక్ రూపకల్పనతో అప్పుడప్పుడూ ముఖ్యమైన మైలురాళ్లను గుర్తుచేస్తుంది. అందులో భాగంగానే ఈ సారి ప్రియాంక రాధాకృష్ణన్ ఫోటోతో ఒక గ్రాఫిక్‌ను సృష్టించి ట్వీట్టర్లో ‘ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్’ పేరుతో పోస్ట్ చేసింది. అముల్ బేబీతో పాటు రాధాకృష్ణన్ నిల్చొని ఉన్న ఈ గ్రాఫిక్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published: