Home /News /international /

AMID RUSSIA UKRAINE WAR KIM JONG UN NORTH KOREA SLAMS US ACTIONS AS ROOT CAUSE OF CRISIS IN UKRAINE MKS

Russia Ukraine War: యుద్దానికి అసలు కారణం ఇదే -ఆ దేశం సూపర్ పవర్ హోదా గల్లంతు!

నార్త్ కొరియా నియంత కిమ్

నార్త్ కొరియా నియంత కిమ్

స్థూలంగా అమెరికా ఓవరాక్షన్ వల్లే యుద్దం తలెత్తిందనేది మెజార్టీ అభిప్రాయం. అదే సమయంలో పుతిన్ దురాగతాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోకెల్లా యుద్ద పిపాసి ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి..

అమెరికాకు అనుకూలంగా, పక్కలో బల్లెంగా మారిందనే ఆక్రోషంతో ఉక్రెయిన్ దేశం మొత్తాన్ని ఆక్రమించేసి, తనలో కలపుకోవాలనే లక్ష్యంతో రష్యా రంకెలేస్తోంది. తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (DPR), లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (LPR)లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంతో ఆగిపోని పుతిన్.. మొత్తం దేశాన్నీ కబళిస్తూ పూర్తి స్థాయి యుద్దం చేస్తుండటం తెలిసిందే. అయితే అసలీ పరిస్థితికి దారి తీసిన కారణాలను ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. స్థూలంగా అమెరికా ఓవరాక్షన్ వల్లే యుద్దం తలెత్తిందనేది మెజార్టీ అభిప్రాయం. అదే సమయంలో పుతిన్ దురాగతాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిమాట ఎలా ఉన్నా ప్రపంచంలోకెల్లా పెద్ద యుద్ద పిపాసిగా పేరుపొందిన ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక స్పందన వెలువరించారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడానికి, అంతకు ముందు సంక్షోభ పరిస్థితులకూ అమెరికానే మూల కారణం అని కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తరకొరియా ఆరోపించింది. తన భద్రత కోసం రష్యా చేసిన చట్టబద్దమైన డిమాండ్ ను పట్టించుకోకుండా అగ్రరాజ్యం అమెరికా సైనిక ఆధిపత్యాన్ని అనుసరించిందని కిమ్ దేశం మండిపడింది. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ తాజాగా తన వెబ్ సైట్ లో ఓ పోస్టును అప్ లోడ్ చేస్తూ, ‘నార్త్ సోసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీస్’ పరిశోధకుడు రిజి సాంగ్‌కి వ్యాఖ్యలను ఉదహరించింది.

CM KCR ఫామ్ హౌజ్‌లో వరి పంట కొనేదెవరు? -Jaganతో కలిసి ముంచేశాడు : Revanth Reddy


ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న యుద్ద పరిస్థితులకు ముమ్మాటికీ అమెరికానే కారణమని, అగ్రరాజ్యపు మితిమీరిన జోక్యం, ఏకపక్ష ధోరణి, ద్వంద్వ ప్రమాణాలే ఇతర దేశాల కొపలు ముంచుతున్నాయని కిమ్ సర్కారు మండిపడింది. శాంతి, స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా అనవసర జోక్యం చేసుకుంటోందని, ఆయా దేశాలు తమ జాతీయ భద్రత కోసం, స్వీయ రక్షణ నిమిత్తం తీసుకుంటోన్న నిర్ణయాలను అమెరికా ఖండించడమేంటని నార్త్ కొరియా నిప్పులు చెరిగింది.

PM Modi: శాంతి స్థాపనకు భారత్ సిద్ధం.. Russia Ukraine warపై మోదీ కీలక హామీ


అమెరికా ప్రపంచ సూపర్ పవర్, సుప్రీం లీగర్ గా వ్యవహరించే రోజులు పోయానని కిమ్ సర్కారు కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే నార్త్ కొరియాలో మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు కిమ్ జోంగ్. కాగా, ఉక్రెయిన్ ఉదంతంలో ప్రపంచ దేశాలన్నీ రష్యా దురాక్రమణను తప్పుపడుతున్నప్పటికీ, ఉక్రెయిన్ కు మద్దతుగా బరిలోకి దిగకపోవడానికి కారణం అమెరికానే అనే ఆరోపణలున్నాయి.

Taliban: తాలిబన్ శాంతి సందేశం -యుద్దం వద్దంటూ Russia Ukraineకు హితవు.. పుతిన్ వింటాడా?


ఉక్రెయిన్ ను తొలి నుంచీ ఎగదోసి, యుద్ధం తేదీలను సైతం ప్రకటించిన అమెరికా.. తీరా రష్యా దాడులు మొదలుపెట్టడానే పత్తా లేకుండా పారిపోవడం, నాటో దళాలను సైతం పంపబోమని ప్రకటించడం తెలిసిందే. అమెరికా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి.. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Kim jong un, North Korea, Russia-Ukraine War, Ukraine, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు