రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా నుండి ముడి చమురును చౌక ధరలకు కొనుగోలు చేసింది. దేశంలోని అతిపెద్ద రిఫైనరీ ఇండియన్ ఆయిల్(Indian Oil) సోమవారం 3 మిలియన్ల రష్యన్ ఆయిల్ (యురల్స్) కోసం విటోల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మేలో సరఫరా చేయబడుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఇది మొదటి ఒప్పందం అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌పై(Ukraine) దాడి తర్వాత అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా చమురు దిగుమతిని కూడా అమెరికా నిషేధించింది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు(Crude Oil) వినియోగదారుగా ఉంది. మన దేశం చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి ద్వారానే వస్తుంది. అయితే ఇప్పటి వరకు రష్యా నుంచి 2 నుంచి 3 శాతం మాత్రమే కొనుగోలు చేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్ యుద్ధం కారణంగా ప్రపంచంలో ముడి చమురు ధరలు 40 శాతం వరకు పెరిగాయి. అయితే ఆంక్షల కారణంగా రష్యా ముడి చమురును చౌకగా అమ్మవలసి వస్తోంది. వీటన్నింటి మధ్య ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా పెరిగిన ముడి చమురు ధరలపై ప్రభావం చూపకూడదని భారత ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి, ముడి చమురు ధరల పెరుగుదలను నిరోధించడానికి భారత ప్రభుత్వం అన్ని తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని రామేశ్వర్ తేలి పార్లమెంట్‌కు తెలిపారు. అదనపు క్రూడ్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే వెల్లడించారు.
అయితే యూనియన్‌కు అనుబంధంగా ఉన్న దేశాలు రష్యా ప్రధాన చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, ట్రాన్స్‌నెఫ్ట్, గాజ్ప్రోమ్ నెఫ్ట్‌లపై కొత్త ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని ఈయూలోని కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆయిల్ రష్యా నుండి ముడి చమురును చివరిసారిగా ఏప్రిల్ 2020లో పారాదీప్ పోర్ట్‌లో దిగుమతి చేసుకుంది.
Russia: యుద్ధంతో రష్యాకు ఇబ్బందులు.. సాయం చేయాలంటూ ఆ దేశానికి రిక్వెస్ట్ ?
Musk-Putin : దమ్ముంటే రా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం..పుతిన్ కి ఎలాన్ మస్క్ సవాల్
మరోవైపు మూడువారాలుగా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా.. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా దాడులు ముమ్మరం చేసింది. ఈ ఉదయం స్వియాటోషిన్ స్కీ డిస్ట్రిక్ లోని 16 ఫ్లోర్ల బిల్డింగ్ పై జరిగిన దాడిలో ఇద్దరు చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. మరో 27 మందిని రక్షించామని చెప్పింది. స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు చనిపోయారని ఉక్రెయిన్ అత్యవసర సేవావిభాగం ప్రకటించింది. మరోవైపు దాడుల కారణంగా కీవ్ సమీపంలోని అంటోనోవ్ ఏవియేషన్ ఇండస్ట్రీ పార్క్ మంటల్లో చిక్కుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War