Home /News /international /

AMID RUSSIA UKRAINE CRISIS INDIAN EMBASSY ADVICE INDIAN STUDENTS AND INDIAN CITIZENS TO LEAVE UKRAINE MKS

Ukraine Crisis: ఉక్రెయిన్ వీడాలంటూ భారతీయులకు సూచన.. కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటన

ఉక్రెయిన్ లోని భారతీయులకు సూచన

ఉక్రెయిన్ లోని భారతీయులకు సూచన

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అక్కడ నివసించే భారతీయులు వీలైతే ఉక్రెయిన్ వీడాలని సలహా ఇచ్చింది. కీవ్స్ లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేసింది.

ఉక్రెయిన్ సంక్షోభం (Ukraine Crisis) గంటగంటకూ ముదురుతోన్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దవాతావరణం (Russia Ukraine Conflict) నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థిని గమనిస్తోన్న మోదీ సర్కార్ మంగళవారం అక్కడి భారతీయులకు కీలక సూచన చేసింది. ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు వీలైతే దేశాన్ని వీడాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్స్ లోని ఇండియన్ ఎంబసీ (Embassy of India, Kyiv) ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.

‘ఉక్రెయిన్‌లోని అస్థిర పరిస్థితులను భారతీయులు దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ చదువుతోన్న భారతీయ విద్యార్థులు దేశం వీడే అంశాన్ని పరిశీలించాలి. అత్యవసరం అయితే తప్ప ముఖ్యంకాని పనులపై ఉన్నవారంతా ఇక్కడుండి ఇబ్బంది పడేకన్నా ఇండియా తిరిగి వెళ్లడం మంచిది’అంటూ విదేశాంగ శాఖ ఆధ్వరర్యంలోని భారత దౌత్యకార్యాలయం మంగళవారం ఒక నోట్ విడుదల చేసింది.

Delhi: వాడు మనిషికాదు కామపిశాచి! -మంచానికే పరిమితమైన 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం


భారత్ కంటే ముందే పలు దేశాలు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను వెనక్కి వచ్చేయాలని పిలుపునిచ్చాయి. ఆ జాబితాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, ఐర్లాండ్‌, బెల్జియం, లక్సంబర్గ్‌, ది నెదర్లాండ్స్‌, కెనడా, నార్వే, ఇస్తోనియా, లిథువేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇజ్రాయెల్‌, సౌదీ, యూఏఈ తదితర దేశాలున్నాయి.

Zaheerabad: ప్రేమికుల రోజు ఏకాంతమంటూ దారుణం.. దిండ్లు పేర్చి నిద్రపోతున్నట్లు నమ్మించి!!


రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దవాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న పలు దేశాల ఎంబసీలు కూడా మూత పడ్డాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపు రద్దయ్యాయి. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యాలు మోహరిచాయి. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణకు దిగడం ఖాయమని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం ఆ పనిచేబోమంటూనే భారీగా సైన్యాన్ని సరిహద్దుల్లోకి దిపింది.
Published by:Madhu Kota
First published:

Tags: India, Russia, Ukraine

తదుపరి వార్తలు