AMID RUSSIA AND UKRAINE CONFLICT AIR INDIA TO FLY 3 PLANES FROM UKRAINE BETWEEN FEB 22 AND 26 TO BRING INDIANS HOME PVN
Air India : ఉక్రెయిన్ లోని భారత విద్యార్థుల కోసం విమానాలు పంపుతున్న టాటా
వెలువడింది.
ఎయిర్ ఇండియా(ప్రతీకాత్మక చిత్రం)
Air India To Fly 3 Planes From Ukraine : రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Air India To Fly 3 Planes From Ukraine : రష్యా, ఉక్రెయిన్ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో దాదాపు 1 లక్ష మంది సైనికులను ఉంచింది రష్యా. నౌకాదళ విన్యాసాల కోసం నల్ల సముద్రానికి యుద్ధనౌకలను పంపడంతో పాటు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని NATO దేశాలలో ఆందోళనలను రేకెత్తించింది. అయితే ఉక్రెయిన్‌పై దాడికి యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది. కాగా, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిణామాలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా (air india) విమానాలు నడపనున్నారు.
ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ సర్వీసులను నడుపుతామని ఎయిర్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించింది. ఉక్రెయిన్ –ఇండియాల మధ్య ఫిబ్రవరి 22, 24, 26తేదీల్లో మూడు విమాన సర్వీసులు నడపనున్నాం. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసెస్, వెబ్సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా టిక్కెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.
ఉక్రెయిన్ లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి అని ట్విట్టర్ ద్వారా ఎయిర్ ఇండియా తెలిపింది.
#FlyAI : Air India will operate 3 flights between India-Ukraine (Boryspil International Airport) India on 22nd, 24th & 26th FEB 2022
Booking open through Air India Booking offices, Website, Call Centre and Authorised Travel Agents.@IndiainUkraine
కాగా,ఉక్రెయిన్ లో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ ఆందోళనకు గురికావొద్దని,స్వదేశానికి తీసుకొచ్చేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని ముందునుంచే చెబుతూ వచ్చింది ఇండియన్ ఎంబసీ. వీలును బట్టి చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా నడుపుతామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక,ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు సమాచారం, సహాయం అందించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలొ భారతీయుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ ను కూడా ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా.. శుక్రవారం యూనిటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉక్రెయిన్ - రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్ తన వాధనను వినిపించింది. ఈ కౌన్సిల్ లో యూఎన్ వో భారత ప్రతినిధి ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఆ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులను చిత్తశుద్ధితో, నిరంతర దౌత్య ప్రయత్నాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. భారత్ ఇదే కోరకుంటుందని అన్నారు. ఈ ప్రాంతం వెలుపల దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించేందుకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ సూచిస్తోందని తెలిపారు. 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.