అమెరికా గూఢచారులను పట్టుకున్నాం.. వారికి ఉరిశిక్షే గతి.. ఇరాన్ సంచలన ప్రకటన!

Iran, USA: ఇరాన్‌లో అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సీఐఏ తరపున పనిచేస్తున్న 17 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ఇరాన్ ఇంటిలిజెన్స్‌ విభాగం వెల్లడించిందని ఓ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 22, 2019, 5:12 PM IST
అమెరికా గూఢచారులను పట్టుకున్నాం.. వారికి ఉరిశిక్షే గతి.. ఇరాన్ సంచలన ప్రకటన!
Iran supreme leader Ayatollah-Ali-Khamenei (Reuters)
  • Share this:
అమెరికా, ఇరాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. గత మే లో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సీఐఏ తరపున పనిచేస్తున్న 17 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ఇరాన్ ఇంటిలిజెన్స్‌ విభాగం వెల్లడించిందని ఓ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అరెస్టైన వారిలో కొందరికి ఉరిశిక్ష కూడా పడినట్లు అధికారులు పేర్కొన్నారని సదరు ఏజెన్సీ వెల్లడించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి ఈ ప్రకటన వెలువడటం సంచనానికి దారి తీసింది. కాగా, సముద్ర జలాల నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో గతవారం హార్ముజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ బ్రిటిష్ ట్యాంకర్‌ను ఇరాన్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నౌకలో భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. జూలై 4న జిబ్రాల్టర్‌ తీరం వద్ద బ్రిటన్‌కు చెందిన రాయల్ మెరైన్స్‌.. ఇరాన్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

ఇదిలా ఉండగా, ఇరాన్ డ్రోన్ గత గురువారం అమెరికా బాక్సర్ నౌకకు దగ్గరగా రావడంతో.. అమెరికా నౌకాదళ సిబ్బంది హెచ్చరించారు. అయినా, ఇరాన్ డ్రోన్‌ అక్కడి నుంచి వైదొలిగేందుకు ససేమిరా అంది. దాంతో అమెరికా నౌకదళం తమ నౌకను, సిబ్బందిని రక్షించుకునే చర్యలో భాగంగా డ్రోన్‌ను నాశనం చేసింది అని పెంటగాన్ ప్రతినిధి జొనాథన్ హాఫ్‌మన్ చెప్పారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 22, 2019, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading