Imran Khan Assassination Plot Rumours : పాకిస్తాన్(Pakistan) ఇటీవల అన్ని పార్టీలు కలిసి ఇమ్రాన్ ఖాన్ ను పదవిలోంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను అంతం చేసేందుకు అక్కడ కుట్ర అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాక్ నిఘా సంస్థలు, ఐఎస్ఐ ప్రమేయం ఇమ్రాన్‌ను అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న చర్చ గత నెల రోజులుగా సాగుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హత్యకు పథకం పన్నారనే వదంతుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తయ్యాయి. ఇస్లామాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా సంస్థలు కట్టదిట్టం చేశాయి. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత నివాసం ఉన్న బెనిగలా ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 విధించారు. నగరంలో ప్రజలు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు ఇస్లామాబాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇస్లామాబాద్ లోని బనిగాలాలో ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పర్యటించనున్నారనే సమాచారం మేరకు ఆ ప్రాంతంలో భద్రతను పెంచామని, హై అలర్ట్ ప్రకటించామని ఇస్లామాబాద్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ బృందం తిరిగి రావడానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఖచ్చితమైన సమాచారం అందలేదు. అయినా ఇమ్రాన్ ఖాన్ కు ఎటువంటి హాని జరగకుండా చట్టప్రకారం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. తమ నాయకుణ్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ సమీప బంధువు హసన్ నియాజీ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే.. దాన్ని పాకిస్తాన్‌పై దాడిగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిస్పందన ఘాటుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కుట్రలో భాగమైనవారు పశ్చాత్తాపపడాల్సి వస్తుందని హెచ్చరించారు. నిఘా సంస్థల నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్ల తేలిందని ఫవాద్ ఏప్రిల్‌లో ఆరోపించారు. అందుకనే ఆయన భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసిందని తెలిపారు.
ALSO READ Shocking: బాప్ రే.. ఆడ తోడు కోసం సింహాల పెనుగులాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదే..
ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా భారత్ ను ప్రశంసించడం తెలిసిందే. త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ అయన ప్రస్తుత సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానిని హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు వాదనలు వస్తున్నా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan