Home /News /international /

AMID BILATERAL CHILL INDIA CHINA TRADE MARKS RECORD SURGE IN 2021 GH VB

China vs India: ఓవైపు బుసలు కొట్టే వివాదం.. మరోవైపు కాసులు పంచే వాణిజ్యం.. భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో భారీ వృద్ధి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం అంతంత మాత్రమే ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, చైనా యాప్స్‌పై(China Apps) నిషేధం లాంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. అయితే ఇంత జరుగుతున్నా వ్యాపార, వాణిజ్యాలు రెండు దేశాల మధ్య సజావుగానే సాగుతున్నాయి.

ఇంకా చదవండి ...
భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రస్తుతం అంతంత మాత్రమే ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, చైనా యాప్స్‌పై(China Apps) నిషేధం లాంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. అయితే ఇంత జరుగుతున్నా వ్యాపార, వాణిజ్యాలు రెండు దేశాల మధ్య సజావుగానే సాగుతున్నాయి. 2021లో రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం(Trade) 43.3 శాతం వృద్ధి చెందిందని చైనా ప్రభుత్వ డేటా నివేదించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. 2021 క్యాలెండర్ ఇయర్‌లో చైనా నుంచి భారత్ దిగుమతుల విలువ 97.5 బిలియన్ డాలర్లతో 46.1 శాతం వృద్ధి నమోదవగా.. 2020లో 66.7 బిలియన్ డాలర్లుగా ఉంది. కోవిడ్ పరిమితుల దృష్ట్యా ఈ గణాంకాలు ప్రభావితమయ్యాయని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డేటా స్పష్టం చేసింది. 2019తో పోలిస్తే 2021లో దిగుమతులు 30.3 శాతం పెరిగాయి.

ఇదే సమయంలో చైనాకు భారత్ ఎగుమతులు కూడా 2021లో రికార్డు స్థాయిలో 28.1 బిలియన్ డాలర్లకు చేరింది. 2020లో ఈ సంఖ్య 20.9 బిలియన్లుగా ఉండేది. అంటే దాదాపు 34.9 శాతం వృద్ధి నమోదైంది. 2019తో పోలిస్తే 2021లో చైనాకు భారత్ ఎగుమతులు 56.5 శాతం పెరిగాయి. గతేడాది చైనాతో భారత్ మొత్తం వాణిజ్యం విలువ 125.7 బిలియన్ డాలర్లకు చేరిందని నివేదిక తెలిపింది. పెద్ద ఎత్తున దిగుమతులు పెరగడం వల్ల చైనాతో భారత్ వాణిజ్య లోటు 2021లో రికార్డు స్థాయిలో 69.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2020లో 45.9 బిలియన్లు ఉండగా.. 2019 నాటికి 56.8 బిలియన్లకు పెరిగింది.

ALSO READ Viral Video: కొండ అంచున కారు.. యూ-టర్న్‌ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా

చైనాదే ఆధిపత్యం
సరిహద్దుల వద్ద ఇరు దేశాలు 14 రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ వివాదాలను పరిష్కరించుకోలేకపోయాయి. కానీ వాణిజ్యపరంగా 2021లో భారత్-చైనా మధ్య మెరుగైన గణాంకాలు ఉత్పన్నమవడం గమనార్హం. చైనా నుంచి భారత్‌కు దిగుమతుల విలువ ఎగుమతుల కంటే దాదాపు నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతి చేసే వాటిలో ప్రధానంగా ప్రాథమిక వస్తువులుండగా.. చైనా నుంచి దిగుమతుల్లో విలువ ఆధారిత వస్తువులను కలిగి ఉండి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ డేటా ప్రకారం, ఏప్రిల్, నవంబరు కాలంలో అమెరికా తర్వాత భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, హాంకాంగ్ లాంటివి మనదేశానికి ఇతర వాణిజ్య భాగస్వాములు. డ్రాగన్ దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్‌లు, ఆటోమొబైల్స్ పరికరాలు, టెలికాం డివైజెస్, ప్లాస్టిక్, మెటాలిక్ వస్తువులు, క్రియాశీల ఔషధ పదార్థాలు, ఇతర రసాయనాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలతో సహా కొన్ని కీలకమైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ దిగుమతులు పెరగడం గమనార్హం.

ఎగుమతుల వృద్ధి..
అమెరికా, యుఏఈ, ఆస్ట్రేలియా సహా ఇతర కీలక వాణిజ్య భాగస్వాములతో వాణిజ్యంలో భారత్ వృద్ధి.. చైనాతో పోలిస్తే మరింత ఎక్కువగా ఉందని ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం UAE, EU, UK, ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) చర్చల ప్రక్రియలో ఉన్నాయని చెప్పారు. చైనాతో భారతదేశం అవుట్‌బౌండ్ వాణిజ్యంలో ముడి పదార్థాల ఎగుమతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి, ఇనుప ఖనిజం, సేంద్రీయ రసాయనాలు ప్రధాన ఎగుమతి వస్తువులలో ముఖ్యమైనవి.

Upside down house : ఆ ఇంట్లో కొద్దిసేపు గడిపేందుకు ఎగబడుతున్న జనం..అంత ప్రత్యేకత ఏంటంటే..


ఇతర కీలక ఎగుమతులలో ఇనుము, ఉక్కు, మత్స్య, ఇంజనీరింగ్ వస్తువులు ఉన్నాయి. లడఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణల తర్వాత డ్రాగన్ దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ వాణిజ్యంలో పెరుగుదల నమోదైంది. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు అసువులు బాశారు. పలువురు చైనా జవాన్లు కూడా మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సెక్యూరిటీ ఆందోళనలను తెరపైకి తెచ్చి చైనా నుంచి ఎలక్ట్రిక్ పరికరాల దిగుమతిపై నిషేధాన్ని విధించింది. అంతేకాకుండా తన నెట్వర్క్ అప్‌గ్రేడ్ ప్రక్రియ నుంచి హువాయ్, జెడ్‌టీఈ సహా పలు చైనీస్ టెలికాం సంస్థలను మినహాయించాలని, ప్రభుత్వం నడిపిస్తున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను కోరింది.

అనంతరం టిక్‌టాక్ సహా పలు చైనీస్ యాప్స్‌ను నిషేధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కూడా సవరించింది. పొరుగు దేశాల నుంచి ఏదైనా ఎఫ్‌డీఐకి వస్తే దాని ఆమోదాన్ని తప్పనిసరి చేసింది. చైనా నుంచి దేశీయ మార్కెట్‌లోకి వస్తువులను డంపింగ్ చేయడంపై భారత్ కూడా నిఘాను కఠినతరం చేసింది. డిసెంబర్ 2021లో స్థానిక తయారీదారులను రక్షించడానికి భారతదేశం ఐదు సంవత్సరాల పాటు కొన్ని అల్యూమినియం వస్తువులు, రసాయనాలతో సహా ఐదు చైనీస్ ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ డ్యూటీలను విధించింది.
Published by:Veera Babu
First published:

Tags: Bharath, China, International news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు