హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: అఫ్గాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు.. జానపద కళాకారుడి హత్య

Afghanistan: అఫ్గాన్ లో కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు.. జానపద కళాకారుడి హత్య

దీంతో పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబాన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు పాకిస్థాన్ మద్దతుతో ఆ 

ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు బీకర పోరో కొనసాగిస్తున్నారు.

దీంతో పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకునేందుకు తాలిబాన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు పాకిస్థాన్ మద్దతుతో ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు బీకర పోరో కొనసాగిస్తున్నారు.

అఫ్గానిస్థాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు వారి అరాచకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై, గతంలో వారిపై పోరాడిన వారిపై పగ తీర్చుకుంటున్నారు.

అఫ్గానిస్థాన్(Afghanistan) ను వశం చేసుకున్న తాలిబన్లు(Taliban) వారి అరాచకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై, గతంలో వారిపై పోరాడిన వారిపై పగ తీర్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ జానపద కళాకారులు ఫవాద్ అందరాబీని కిరాతకంగా కడతేర్చారు. ఈ వివరాలను బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై జవాద్ అందరాబీ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితమే కొందరు తాలిబనులు తమ ఇంటికి వచ్చి అందరాబీతో కలిసి టీ తాగారన్నారు. కానీ ఇంతలోనే తమ తండ్రిని హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేవారు. ఇదిలా ఉంటే తరుగుబాటుదారేలే ఫవాద్ అందరాబీని చంపి ఉంటారని తాలిబన్లు చెప్పారు. అయితే ఈ హత్యపై బాధితుడి కుమారుడు జవాద్ అంబరాబీ స్థానిక తాలిబాన్ కౌన్సిల్ కు వెళ్లారు. తన తండ్రిని హత్య చేసిన వారిని గుర్తించి శిక్షిస్తామని కౌన్సిల్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ హత్యకు కారణమైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని ఆయన చెప్పడం విశేషం.

Kabul: కారు నిండా బాంబులు.. ఎయిర్‌పోర్టుపై దాడికి టెర్రరిస్ట్‌ల స్కెచ్.. కానీ అంతలోనే..

ఇదిలా ఉంటే.. తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఓ వైపు తాలిబన్ల(Taliban) ఆకృత్యాలు, మరో వైపు ఉగ్రవాదుల భయాల నడుమ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. తాలిబన్ల కింద బతకలేమని భావించిన అనేక మంది దేశాన్ని వీడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కన్నీటిని పెట్టిస్తున్నాయి. నిత్యం వేలాదిగా ప్రజలు దేశం దాటడానికి ఏకైక మార్గం అయిన కాబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు(Kabul Airport) చేరుకుంటున్నారు.

Kabul Blast: కాబూల్‌లో భారీ పేలుడు.. అమెరికా హెచ్చరించిన కొన్ని గంటల్లోనే మరో దాడి

అక్కడి బ్యాంకుల్లో(Banks) డబ్బులు లేకపోవడం మరో ఆందోళనకు కారణమైంది. దాదాపుగా ఆరు నెలల నుంచి వేతనాలు రాక ప్రజలు అక్కడ బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. ప్రజలకు కూడా ఏటీఎంల వద్ద డబ్బులను తీసుకోవడానికి బారులు దీరి కనిపిస్తున్నారు. తాజాగా న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మూడు నుంచి ఆరునెలల పాటు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు వాపోయారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

First published:

Tags: Afghanistan, Taliban

ఉత్తమ కథలు