HOME »NEWS »INTERNATIONAL »americas nasa prepares to fire up the most powerful rocket ever built on january 17 srd gh

NASA: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు

NASA: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన నాసా.. అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు
ప్రతీకాత్మక చిత్రం

NASA: 2020 ఏడాదిలో రోదసి సంస్థలు అనేక ప్రయోగాలను చేపట్టాయి. దాదాపు 40 ఏళ్ల తర్వత చంద్రుడి ఉపరితల నమూనాలు నేలకు చేరాయి. జాబిల్లి అన్వేషణలో భాగంగా నవంబర్ 24న చైనా చేపట్టిన చాంగే–5 ప్రయోగం విజయవంతమైంది. దీంతో పాటు..

  • Share this:
2020 ఏడాదిలో రోదసి సంస్థలు అనేక ప్రయోగాలను చేపట్టాయి. దాదాపు 40 ఏళ్ల తర్వత చంద్రుడి ఉపరితల నమూనాలు నేలకు చేరాయి. జాబిల్లి అన్వేషణలో భాగంగా నవంబర్ 24న చైనా చేపట్టిన చాంగే–5 ప్రయోగం విజయవంతమైంది. దీంతో పాటు, అమెరికా ప్రైవేటు రోదసీ సంస్థ స్పేస్ ఎక్స్ వాణిజ్య అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై ఉన్న నమూనాలు భూమికి చేరాయి. ఇక ఇదే వేగంతో అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా(NASA) 2021 జనవరి 17న మరో శక్తివంతమైన రాకెట్(rocket)ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగంతో వాణిజ్యేతర మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుమగం కానుంది. కాగా, స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) ప్రయోగం ఇదివరకే జరగాల్సినప్పటికీ, అనేక కారణాల వల్ల చాలాసార్లు దీన్ని వాయిదా పడింది. కాగా, ఈ రాకెట్ ప్రయోగాన్ని ఆర్టెమిస్ స్సేస్ ప్రోగ్రామ్(Artemis space program)కు కొనసాగింపుగా చేపట్టనుంది నాసా. ఈ ప్రయోగంతో ఒక మహిళను, పురుషుడిని చంద్రునిపైకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ రాకెట్లో సాధారణంగా ద్రవ ఇంధన ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లు అనే రెండు ప్రధాన భాగాలను జోడించింది. నాసా ప్రయోగించిన మొత్తం ఎనిమిది -ప్రయోగ దశల్లో, ఇది చివరి దశ. ఏడవ దశను 2020 డిసెంబర్ 20 న విజయవంతంగా పూర్తి చేసింది. కాగా, ప్రస్తుతం చేపట్టిన చివరి దశకు ‘SLS Green Run’ అని పేరు పెట్టింది. కాగా, ఏడవ దశ పూర్తయిన తర్వాత ఈ రాకెట్ 700,000 గ్యాలన్ల (265,000 లీటర్లు) సూపర్ కూల్డ్ ద్రవ ఇంధనాన్ని మోయగలదని నాసా నిర్థారించుకుంది. ఇక, చివరి దశ మిస్సిస్సిప్పి(Mississippi)లోని బే సెయింట్ లూయిస్ సమీపంలోని నాసా స్టెనిస్ అంతరిక్ష కేంద్రంలో ప్రదర్శించబడుతుందని నాసా స్పష్టం చేసింది. మునుపటి ఏడు దశల టెస్ట్ రన్లలో వచ్చిన డేటాను సేకరించి నాసా ఈ చివరి టెస్ట్రన్ను చేపట్టనుంది.

నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం..



2021 జనవరి 17న ప్రయోగించనున్న స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్)లో 322 అడుగుల పొడవైన రాకెట్ను లాంచ్ చేయనున్నట్లు ఎస్ఎల్ఎస్ స్టేజెస్ మేనేజర్ జూలీ బాస్లర్(Julie Bassler) పేర్కొన్నారు. అయితే, 1960 లలో వ్యోమగాముల(astronauts)ను చంద్రుని వద్దకు తీసుకెళ్లిన 363 అడుగులు పొడవు గల సాటర్న్ వి రాకెట్ కన్నా దీని పొడువు కొంచెం తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే, అధిక శక్తి కలిగిన ఈ రాకెట్ అదనంగా బాహ్య అంతరిక్షంలోకి చాలా భారాన్ని మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ చంద్రునిపైకి 27 టన్నుల (24,000 కిలోగ్రాములు) బరువును విజయవంతంగా మెసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాటర్న్ V మునుపటి ప్రయోగాల కంటే ప్రస్తుతం చేపట్టబోయే చివరిదశ ప్రయోగాన్ని ‘మంచి కార్గో మూవర్’గా పేర్కొంది నాసా. కాగా, నాసా చేపట్టబోయే ఈ చివరి దశ ‘టెస్ట్ రన్‌’ను తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షం ప్రసారం చేయనుంది.
Published by:Sridhar Reddy
First published:January 11, 2021, 19:25 IST