AMERICAN PRESIDENT ELECT MIDDLE CLASS JOE BIDEN NET WORTH WILL SHOCKS EVERYONE HSN
Joe Biden Net Worth: అగ్రరాజ్య అధినేత కాబోతున్న జో బైడెన్.. ఆస్తుల లెక్కెంతో తెలిస్తే..
జో బైడెన్ (ఫైల్ ఫొటో)
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ గురించి సర్వత్రా చర్చ జరగుతోంది. ట్రంప్ ఓ వ్యాపారవేత్త, అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడయ్యారు. మరి జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న బైడెన్ హిస్టరీ ఏంటి..? ఆయన ఆస్తి ఎంత..? అన్న విషయాలను నెటిజన్లు వెతుకుతున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ట్రంప్ తర్వాత పగ్గాలు చేపట్టేది జో బైడెనేనని బుధవారం అమెరికన్ కాంగ్రెస్ కూడా నిర్ణయించింది. ట్రంప్ కూడా పదవీ బాధ్యతల బదలాయింపు ప్రక్రియకు సహకరిస్తానని స్పష్టం చేశారు. బుధవారం క్యాపిటల్ భవన్ పై ట్రంప్ అనుచరుల దాడి తర్వాత అగ్రరాజ్యంలో ఊహించని పరిణామాలు జరిగాయి. అధ్యక్ష పీఠం దిగనంటూ నిన్నటిదాకా మొండిగా ఉన్న ట్రంప్, తనను పదవీచ్యుతుడిని చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు రావడంతో ఓ మొట్టు దిగారు. ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్నారు. బైడెన్ ఎన్నికకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ గురించి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ట్రంప్ ఓ వ్యాపారవేత్త, అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడయ్యారు. మరి జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న బైడెన్ హిస్టరీ ఏంటి..? ఆయన ఆస్తి ఎంత..? అన్న విషయాలను నెటిజన్లు వెతుకుతున్నారు.
జో బైడెన్ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి. అతి సాధారణ జీవితం నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. 1969లో న్యాయవాది అయ్యాడు. ఆ తర్వాత ఒక్క ఏడాదికే న్యూ కాజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. 1972లో సెనేటర్ గా గెలిచారు. ఆయన సెనేటర్ గా గెలిచిన కొద్ది నెలల్లోనే భార్య, ఓ ఏడాది వయసున్న కూతురు ఓ ప్రమాదంలో మరణించారు. ఆ బాధ నుంచి తట్టుకునేందుకు పూర్తిగా పదవీ బాధ్యతలపైనే బైడెన్ దృష్టి సారించారు. మొదటి భార్య మరణించిన ఐదేళ్ల తర్వాత జిల్ నురెండో పెళ్లి చేసుకున్నారు. 1972 నుంచి ఇప్పటి వరకు ఆయనది పూర్తిగా రాజకీయ జీవితమే. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అనేక కీలక పదవులను చేపట్టారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు.
జో బైడెన్ ను మిడిల్ క్లాస్ జో.. అని అంటుంటారు. కానీ ఆయన ప్రస్తుతం మధ్యతరగతి మనిషి ఏమీ కాదు. 1979లో సెనేటర్ గా ఆయన జీతం ఏడాదికి 42వేల 500 డాలర్లు. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన జీతం 2,30,700 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఒక కోటీ 69 లక్షల రూపాయలన్నమాట. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఆయన వెల్లడించిన ఆస్తి విలువ ఏకంగా 9 మిలియన్ డాలర్లు. అంటే ఏకంగా 66 కోట్ల రూపాయలన్న మాట. 2017లో జో బైడెన్ డెలావేర్ లో 2.7 మిలియన్ డాలర్ల విలువైన బీచ్ హోమ్ ను కొనుగోలు చేశారు. ఆయనకు పుస్తకాలు రాసే అలవాటు ఉంది. ఇప్పటి వరకు రెండు పుస్తకాలను రాశారు. ఆ పుస్తకాలపై వచ్చే ఆదాయంతోపాటు, ఆయనకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. వివిధ యూనివర్శిటీల్లో ప్రసంగాలు ఇస్తుంటారు. వీటి ద్వారానే ఆయనకు ఆదాయం సమకూరుతోంది.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.