Alligator Theft: మొసలిని దొంగలించిన తింగరి కుర్రాడు.. కానీ అతడు చెప్పిన కారణం వింటే..

ప్రతీకాత్మక చిత్రం

తిక్క ఉంటే.. దానికి లెక్క‌ ఉండాలి. అంతే కానీ లెక్క‌లేని తిక్క ఉంటే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.

  • Share this:
తిక్క ఉంటే.. దానికి లెక్క‌ ఉండాలి. అంతే కానీ లెక్క‌లేని తిక్క ఉంటే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చాలమంది నానా రకాలుగా ట్రై చేస్తుంటారు. ఒక్కోసారి పప్పులో కాలేసి చిక్కుల్లో పడుతుంటారు. అలా డిఫరెంట్ గా ట్రై చేసిన ఓ వ్యక్తి పోలీసుల చేతుల్లో తన్నులు తినాల్సి వచ్చింది. చివరకు జైలు ఉచలు లెక్కించాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన విలియ‌మ్ బుబ్బా హ‌డ్జ్‌ అనే వ్యక్తికి పిచ్చి పీక్స్‌కు వెళ్లింది. మనం ఏం చేస్తే ఏముందిలే అనుకున్నాడో ఏమో.. ఏకంగా మొస‌లిని దొంగిలించాడు. పైగా దానికి పాఠాలు, గుణ‌పాఠాలు చెప్ప‌డానికే ఈ చోరీ చేశాన‌ని చెప్పి పోలీసులకు షాకిచ్చారు. మరి వాళ్లు ఊరుకుంటారా..? మనోడికి బడితెపూజ చేసి శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపారు. వివ‌రాల్లోకి వెళ్తే... 32 ఏళ్ళ విలియ‌మ్ బుబ్బా హ‌డ్జ్ ను డైటోనా స‌ముద్ర‌తీరం వ‌ద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మొస‌లిని దొంగిలించి భ‌వ‌నం పైక‌ప్పు పైకి విసిరేందుకు ప్ర‌య‌త్నించాడ‌నేది ఇతనిపై అభియోగం.

ఇత‌గాడు ఈ మొస‌లిని విసిరేయ‌డమే కాదు, నేల‌పైకి విసిరి కొట్టి రెండుసార్లు కాళ్ళ‌తో తొక్కాడ‌ని కూడా వార్త‌లు వెలువ‌డ్డాయి. క్రూరంగా ఉండే మొస‌లికి బుద్ధి చెప్పాల‌నుకున్నానని, అందుకే దాన్ని దొంగిలించానని ఆ వ్యక్తి త‌న‌ను అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన పోలీసుల‌కు సాఫీగా చెప్పాడు. అంతేకాదు తాను మొస‌లిని ఎలా దొంగిలిచాడనే వివరాలను కూడా పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించాడు.

తాను గోల్ప్ కోర్టువ‌ద్ద జ‌రిగిన కుస్తీపోటీలు చూడ‌టానికి వ‌చ్చాన‌ని, పోటీలు చూశాక డైటోనా బీచ్‌లోని కాంగోరివ‌ర్ గోల్ఫ్ కోర్టు ఎన్‌క్లోజ‌ర్ దూకి, మొస‌లి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాన‌ని హాడ్జ్ తెలిపాడు. ఆ త‌రువాత దాని తోక‌ప‌ట్టుకుని ఈడ్చుకుంటూ బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి.. అక్క‌డే ఉన్న ఓ బిల్డింగ్ పైకి విసిరే ప్ర‌య‌త్నం చేశాడు. అంత‌కుముందు దాన్ని నేల‌కేసి కొట్టి, కాళ్ళ‌తో తొక్కి నానా హింస‌లు పెట్టాడు. ఈ ప్ర‌బుద్ధుడిని అరెస్ట్ చేశాక గాయ‌ప‌డిన మొస‌లిని కాంగో రివ‌ర్ గోల్ఫ్ కోర్టు యాజ‌మాన్యానికి తిరిగి అప్ప‌గించారు.

మొస‌లికి గాయాలయ్యాయి. కానీ అది బ‌తికే ఉంద‌ని అధికారులు తెలిపారు. మొస‌లిని గాయ‌ప‌ర‌చ‌డం, ఆయుధ‌ర‌హితదోపిడీ, దొంగ‌త‌నం, నేర‌స్వ‌భావం ఉన్న తింగ‌రిప‌నులు చేయ‌డం త‌దిత‌ర అభియోగాల‌పై డైటోనా బీచ్‌షోర్స్ ప్ర‌జాభ‌ద్ర‌త అధికారులు కేసు న‌మోదు చేశారు. అయితే హాడ్జ్ తింగ‌రి ప‌నులు స్టేష‌న్‌లోనూ కొన‌సాగాయి. ఇత‌న్ని బంధించిన సెల్‌లో మ‌రుగుదొడ్డి డ్రైనేజీని కాగితాలతో నింపేశాడు. జైలు మొత్తాన్ని డ్రైనేజీ వాట‌ర్‌తో మునిగేలా చేస్తాన‌ని బెదిరించిన‌ట్టు కూడా వార్త‌లు వెలువ‌డ్డాయి. మొత్తానికి మొస‌లిని దొంగిలించి జైలు ఊచ‌లు లెక్క‌పెడుతున్న హాడ్జ్‌కు తిక్క కుదిరేదెప్ప‌టికో..!
Published by:Purna Chandra
First published: