ఆపరేషన్ ఐసిస్ చీఫ్ బాగ్దాది.. ఫోటోలు,వీడియోలు విడుదల చేసిన అమెరికా..

అమెరికన్ భద్రతా బలగాలకు భయపడి పారిపోయి బాగ్దాది ఓ ఇంట్లో దాక్కున్నాడు.అమెరికన్ సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టి కాల్పులకు సిద్దపడింది.

news18-telugu
Updated: October 31, 2019, 12:01 PM IST
ఆపరేషన్ ఐసిస్ చీఫ్ బాగ్దాది.. ఫోటోలు,వీడియోలు విడుదల చేసిన అమెరికా..
పెంటగాన్ విడుదల చేసిన ఫోటోలు
  • Share this:
ఇటీవల ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదిని అమెరికన్ సేనలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలు,వీడియోలు విడుదల చేసింది. పెంటగాన్ విడుదల చేసిన ఫుటేజీలో బ్లాక్&వైట్ ఫోటోల్లో అమెరికన్ సేనలు బాగ్దాది తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టడం గమనించవచ్చు. అలాగే సిరియాలోని ఇడ్లిబ్‌లో అమెరికన్ వాయు సేనలకు చెందిన హెలికాప్టర్లపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన వీడియోను కూడా పెంటగాన్ విడుదల చేసింది. దాడికి ముందు,దాడి తర్వాత బాగ్దాది తలదాచుకున్న ఇంటి చిత్రాలను కూడా గమనించవచ్చు. దాడి తర్వాత ఆ ఇల్లు పూర్తి నేలమట్టమైంది.(అమెరికన్ సేనల ఆపరేషన్‌లో ధ్వంసమైన బాగ్దాది తలదాచుకున్న స్థావరం)

అమెరికన్ భద్రతా బలగాలకు భయపడి పారిపోయి బాగ్దాది ఆ ఇంట్లో దాక్కున్నాడు. అమెరికన్ సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టి కాల్పులకు సిద్దపడింది. అయితే ఈలోపు బాగ్దాదియే తనను తాను పేల్చేసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ సమయంలో అతనితో పాటు ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు.ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ధ్రువీకరించారు. అమెరికన్ భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదని, అత్యంత వృత్తి నిబద్దతతో ఆపరేషన్‌ను చేపట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ తెలిపారు.ఈ ఆపరేషన్ ద్వారా అమెరికన్ మిలటరీ గొప్ప పరంపరను కొనసాగించామన్నారు.
Published by: Srinivas Mittapalli
First published: October 31, 2019, 11:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading