Home /News /international /

AMERICAN HEIGHTS FOR A WARPLANE THAT SANK AT SEA PLAN TO COUNTER CHINA DETAILS HERE GH VB

F35-C Fighter Jet: సముద్రంలో మునిగిపోయిన యుద్ధ విమానం కోసం అమెరికా ఎత్తులు.. చైనాను ఎదుర్కోవడానికి ప్రణాళిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ నుంచి టేకాఫ్ అయిన సమయంలో అపశృతి జరగడం వల్ల 100 మిలియన్ డాలర్ల విలువైన F35-C విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది.

సోమవారం నాడు ల్యాండింగ్ ప్రమాదం వల్ల దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో ఎఫ్-35సీ అనే అమెరికా యుద్ధ విమానం (F35-C fighter jet) కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫైటర్ జెట్... అధునాతన స్టెల్త్ ఫైటర్ యుద్ధ‌నౌక అయిన యూఎస్ఎస్ కార్ల్ విన్సన్‌ (USS Carl Vinson)లోని ఫ్లైట్ డెక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విన్సన్ దెబ్బతినలేదు. అయితే సమీప శత్రు దేశాలు జెట్ టెక్నాలజీని తస్కరించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో విమానం శిధిలాల హై-టెక్ భాగాలను స్వాధీనం చేసుకోవాలని యూఎస్ నేవి (US Navy) అధికారులు తొందర పడుతున్నారు. చైనా దాదాపుగా దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని క్లెయిమ్ చేస్తుంది. అది విమానం శిధిలాలలో నుంచి అవసరమైన వాటిని తీసుకోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ నావికాదళం చైనీయుల కంటే ముందుగా యుద్ధ విమానాన్ని చేరుకోవడానికి సమయంతో పోటీపడుతోంది.

Rare Gold Coin: అతడు సరదాగా అలా నడుచుకుంటూ వెళ్లాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..?


యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ నుంచి టేకాఫ్ అయిన సమయంలో అపశృతి జరగడం వల్ల 100 మిలియన్ డాలర్ల విలువైన F35-C విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. ఈ జెట్ నౌకాదళం మొన్నీమధ్య తయారుచేసినదే. కాగా ఇందులో క్లాసిఫైడ్ పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అంతర్జాతీయ జలాల్లో ఉన్నందున వీటిని దక్కించుకునేందుకు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరగొచ్చు. ఈ యుద్ధంలో ఎవరు ముందుగా అక్కడికి చేరుకుంటారో వారే గెలుస్తారు. గెలిచినవారు ఈ అత్యంత ఖరీదైన, అగ్రగామి జెట్ వెనుక ఉన్న అన్ని రహస్యాలు తెలుసుకుంటారు. ఇది ఇప్పుడు సముద్రగర్భంలో ఉండగా.. ఇది ఎక్కడ కూలిపోయిందో లేదా దాన్ని తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుందో నావికాదళం క్లారిటీ ఇవ్వలేదు.

ALSO READ Selfie Point: సెల్ఫీ పాయింట్ కార‌ణంగా కొట్టుకొన్న పార్టీలు.. 100 మందికి పైగా గాయాలు

చైనా దాదాపు మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని క్లెయిమ్ చేస్తోంది. అలాగే ఇటీవలి సంవత్సరాలలో ఆ దావాను నొక్కిచెప్పడానికి ఎక్కువగా చర్యలు తీసుకుంది. జాతీయ భద్రతా నిపుణులు జెట్‌ను చేరుకోవడానికి చైనా మిలిటరీ చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. అయితే క్రాష్ సైట్ నుంచి యూఎస్ నౌక కనీసం 10 రోజుల దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది చాలా ఆలస్యమని డిఫెన్స్ కన్సల్టెంట్ అబి ఆస్టెన్ చెప్పారు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ బ్యాటరీ అంతకు ముందే డెడ్ అయ్యింది. ఫలితంగా విమానాన్ని గుర్తించడం కష్టమవుతుంది. "యూఎస్ దీనిని తిరిగి పొందడం చాలా ముఖ్యం," అని ఆమె చెప్పింది. "F-35 ప్రాథమికంగా ఎగిరే కంప్యూటర్ లాంటిది. దీన్ని ఇతర ఆస్తులను లింక్ చేయడానికి రూపొందించారు. వైమానిక దళం దీన్ని షూటర్‌లకు సెన్సార్‌లను లింక్ చేసే విమానం అని పిలుస్తుంది." అని ఆమె వివరించింది.

దక్షిణ చైనా సముద్రంలో ఏం జరగబోతోంది?
చైనా వద్ద ఎఫ్-35సీ జెట్ టెక్నాలజీ లేదు కాబట్టి వారి చేతుల్లోకి ఇది వెళ్తే వారికి పెద్ద పురోగతి లభించినట్లు అవుతుందని అబి ఆస్టెన్ చెప్పారు. వారు 35 నెట్‌వర్కింగ్ సామర్థ్యాలలోకి ప్రవేశించగలిగితే, అది మొత్తం క్యారియర్ ఫిలాసఫీని సమర్థవంతంగా దెబ్బతీస్తుందని ఆమె అన్నారు. ఇక్కడ ప్రచ్ఛన్నయుద్ధం జరిగే సూచనలు ఉన్నాయా అని అడిగితే... ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ సినిమాలో లాగా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారే అవకాశం ఉందన్నారు.

F-35C ప్రత్యేకత ఏంటి?

- ఇందులో ఉండే నెట్‌వర్క్-ఎనేబుల్డ్ మిషన్ సిస్టమ్ అనేది యుద్ధ విమానం ఆకాశంలో ఉన్నప్పుడు సేకరించే సమాచారాన్ని రియల్ టైం షేరింగ్ కు అనుమతిస్తుంది.

- ఇది యూఎస్ నావికాదళంలో తొలిసారిగా చేరిన "తక్కువగా పరిశీలించదగిన (low-observable)" క్యారియర్-బేస్డ్ విమానం. ఇది శత్రు గగనతలంలో ఎవరికీ చిక్కకుండా తన ఆపరేషన్ కొనసాగించగలదు.

Viral Video: కొండ అంచున కారు.. యూ-టర్న్‌ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా

- పెద్ద రెక్కలు, మరింత దృఢమైన ల్యాండింగ్ గేర్లు సముద్రంలో వాహకాలపై నుంచి "కాటాపుల్ట్ లాంచ్‌ల (catapult launches)"కి అనువుగా ఉంటాయి.

- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ జెట్ గరిష్టంగా 1,200 mph లేదా Mach 1.6 వేగాన్ని అందుకోగలదు.

- ఇది దాని రెక్కలపై రెండు క్షిపణులను, లోపల నాలుగు క్షిపణులను మోసుకెళ్లగలదు.

జాయింట్ చీఫ్స్ యూఎస్ ఛైర్మన్ మాజీ సలహాదారు, మాజీ సీనియర్ నాటో, ఈయూ దౌత్యవేత్త ఆస్టెన్ మాట్లాడుతూ సాల్వెజ్ లేదా రికవరీ హక్కులను క్లెయిమ్ చేయడానికి చైనా చేసే ఎలాంటి ప్రయత్నమైనా యూఎస్ కు ఒక "ఒత్తిడి పరీక్ష"లా మారుతుందనన్నారు. చైనా ఈ విమానాన్ని కోరుకుంటుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ చైనా తన సైబర్ గూఢచర్యం ద్వారా విమానం ఇంటీరియర్, లేఅవుట్ వర్కింగ్‌ల గురించి ఇప్పటికే కొంత సమాచారం కలిగి ఉంటుందని ట్రూమాన్ ప్రాజెక్ట్‌లో చైనా వ్యవహారాల విశ్లేషకుడు, సెక్యూరిటీ ఫెలో బ్రైస్ బారోస్ చెప్పారు. "విమానం వాస్తవ భాగాలను చూడాలని, అది ఎలా నిర్దేశించబడిందో బాగా అర్థం చేసుకోవాలని, దాని బలహీనతలను కనుగొనాలని చైనా వారు తహతహ లాడుతున్నారని నేను భావిస్తున్నాను." అని బారోస్ పేర్కొన్నారు. USS కార్ల్ విన్సన్‌లో జరిగిన "ప్రమాదం" తర్వాత రికవరీ ఆపరేషన్ జరుగుతోందని యూఎస్ నావికాదళం ఒక ప్రకటనలో అంగీకరించింది.

China vs India: ఓవైపు బుసలు కొట్టే వివాదం.. మరోవైపు కాసులు పంచే వాణిజ్యం.. భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యంలో భారీ వృద్ధి..


రికవరీ ఆపరేషన్ ఎలా పని చేస్తుంది?
యూఎస్ నేవీ సూపర్‌వైజర్ ఆఫ్ సాల్వేజ్ అండ్ డైవింగ్ నుంచి వచ్చిన బృందం జెట్ ఫ్యూజ్‌లేజ్‌కు లేదా మెయిన్ బాడీకి బ్యాగ్‌లను జత చేస్తుంది. ఆ తర్వాత శిధిలాలను పైకి లేపడానికి నెమ్మదిగా బ్యాగ్‌లను పైకి లేపుతుంది. దురదృష్టం కొద్దీ ఎయిర్‌ఫ్రేమ్ ఒక పీస్ గా లేకుంటే ఈ ఆపరేషన్ మరింత కష్టమవుతుంది. విమానం దాని రెక్కలపై లేదా అంతర్గత ఆయుధాల స్టోరేజ్ పార్టులో కనీసం రెండు క్షిపణులతో ఆయుధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది రికవరీని క్లిష్టతరం చేస్తుంది. గతంలో అంటే 1974లో ప్రచ్ఛన్నయుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో, CIA ఒక పెద్ద యాంత్రిక పంజా (giant mechanical claw)ను ఉపయోగించి హవాయి తీరంలోని సముద్రపు అడుగుభాగం నుంచి రహస్యంగా రష్యన్ జలాంతర్గామిని లాగింది.

రెండు సంవత్సరాల క్రితం, చైనా తూర్పు తీరంలో మునిగిపోయిన యూకే జలాంతర్గామి HMS పోసిడాన్‌ను చైనా సైన్యం రహస్యంగా రికవరీ చేసుకుంది. 2011లో ఒసామా బిన్ లాడెన్ సమ్మేళనంపై దాడిలో క్రాష్-ల్యాండ్ అయిన యూఎస్ రహస్య "స్టెల్త్" హెలికాప్టర్ శిధిలాలు చైనా చేతికి చిక్కాయని చాలామంది నమ్ముతుంటారు. "చైనీస్ మిలిటరీ ఇప్పటికే జెట్ విమానం ఆన్‌బోర్డ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను చూసిందని మేం నమ్ముతున్నాం." అని మిస్టర్ బారోస్ అన్నారు.

మే 2019లో ఫిలిప్పీన్ సముద్రపు నేల నుంచి యూఎస్ నేవీ రవాణా విమానం శిధిలాలను ఉపరితలానికి 5,638మీ (18,500 అడుగులు) దిగువన నుంచి పైకి లేపారు. అత్యంత లోతైన, విజయవంతమైన రికవరీ ఆపరేషన్ గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. అయితే ప్రస్తుతం శత్రు దేశాలకు విమానం టెక్నాలజీ కాకుండా చేసేందుకు యూఎస్ కు మరొక మార్గం కూడా ఉంది. అది ఏంటంటే బీజింగ్ చేతుల్లోకి రాకుండా ఆపడానికి జెట్‌ను నాశనం చేయడం. "దీన్ని టార్పెడో చేయడమే సులభమైన పని!" అని ఒక సైనిక అధికారి అన్నారు. కానీ అది పరిశీలనలో ఉన్న మార్గంగా ఎవరూ చెప్పడం లేదు.
Published by:Veera Babu
First published:

Tags: America, China

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు