హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

DNA Test : పూర్వీకుల గురించి తెలుసుకోవాలని డీఎన్ఏ టెస్ట్..రిపోర్ట్ చూసి షాక్..బట్టబయలైన రహస్య యవ్వారం

DNA Test : పూర్వీకుల గురించి తెలుసుకోవాలని డీఎన్ఏ టెస్ట్..రిపోర్ట్ చూసి షాక్..బట్టబయలైన రహస్య యవ్వారం

కుటుంబ సభ్యులతో మైయా

కుటుంబ సభ్యులతో మైయా

Woman found dad not her real father after DNA : విదేశాల్లో DNA పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తమను తాము పరీక్షించుకోవడం ద్వారా మునుపటి తరం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Usawan, India

Woman found dad not her real father after DNA : విదేశాల్లో DNA పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఈ రోజుల్లో చాలామంది ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తమను తాము పరీక్షించుకోవడం ద్వారా మునుపటి తరం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల, ఉత్సుకత, వినోదం కోసం DNA పరీక్ష చేయించుకున్న ఒక అమెరికన్ మహిళ(American Woman DNA Test)..ఫలితం చూసి షాక్ అయ్యింది.

మైయా ఎమ్మోన్స్-బోరింగ్(41)అనే మహిళ..భర్త బ్రెంట్,16 ఏళ్ల కుమార్తె లారిస్సాతో కలిసి అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తున్నారు. అక్టోబరు 2018లో తమ DNA పరీక్ష చేయించుకోవచ్చని పేర్కొన్న ఒక ప్రకటనను చూశారు. మైయాకి తన పూర్వీకుల గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం, కాబట్టి పరీక్ష చేయించుకోవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే మైయా డీఎన్ఏ టెస్ట్ (DNA Test)చేయించుకుంది. కానీ టెస్ట్ రిపోర్టు రాగానే మైయా స్పృహ తప్పి పడిపోయింది. తన తండ్రి నిజానికి తన జీవసంబంధమైన తండ్రి కాదని రిపోర్ట్ లో తేలిన విషయాన్ని చూసి మైయాకి కొద్దిసేపు నోటి వెంట మాట రాలేదు. మైయా తల్లి షెర్రిల్(69) తండ్రి జాన్(67) సోదరి తాహ్నీ-గ్రేస్(36), 29 ఏళ్ల సోదరి కూడా రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. దీంతో తల్లిదండ్రులు కూతురు ముందు రహస్యాన్ని బయటపెట్టారు.తండ్రికి 18 ఏళ్ల వయసులో వృషణ క్యాన్సర్‌ సోకిందని, అందుకే తాను తండ్రి కాలేకపోయానని చెప్పాడు. అప్పుడు షెర్రిల్-జాన్ దంపతులు హాస్పిటల్ సహాయంతో తెలియని స్పెర్మ్ డోనర్ నుండి స్పెర్మ్ తీసుకోవడం ద్వారా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు వీర్య దానం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారని, చిన్న కూతురు తమ సొంత బిడ్డ అని తల్లిదండ్రులు చెప్పారు.

Today Lucky Rashi : నేటి అదృష్ట రాశులు ఇవే..వ్యాపారంలో లాభం,కొత్త పనులకు అనుకూలం

దీని తరువాత మాయకు DNA పరీక్షా సంస్థ నుండి మరొక మెయిల్ వచ్చింది. మొత్తం 18 మంది మహిళలను ఆమె సోదరీమణులుగా గుర్తించినట్లు అందులో ఉంది. DNAనివేదికల నేపథ్యంలో మయా ఆన్‌లైన్ ఫ్యామిలీ ట్రీ మేకింగ్ సైట్‌లను సంప్రదించింది. అప్పుడు ఆమె అనుమానం తమ తల్లిదండ్రులు సంప్రదించిన వైద్యుడుపైకి మళ్లింది. ఆ డాక్టర్ తన సొంత స్పెర్మ్ ఇచ్చి తమ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాడని అనుమానించింది. . దీంతో మైయా ఆసుపత్రి, 80 ఏళ్ల డాక్టర్ జోన్స్‌పై కోర్టులో పిటిషన్ వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో...స్పెర్మ్ డోనర్ గురించి రోగికి తెలియజేయకుండా తన స్పెర్మ్‌ను దానం చేసినందుకు కోర్టు డాక్టర్ ని దోషిగా నిర్ధారించింది. 70 కోట్ల నష్టపరిహారాన్ని ఆ కుటుంబాలకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మైయా, ఆమె కుటుంబం మధ్య సంబంధం ఇప్పుడు బాగానే ఉంది.


usa

First published:

Tags: USA

ఉత్తమ కథలు