• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • AMERICAN COURT GIVES VERDICT ON GEORGE FLOYD MURDER CASE AND POLICE OFFICER DEREK CHAUVIN CONVICTED FULL DETAILS HERE PRN GH

George Floyd Case: జార్జ్ ఫ్లాయిడ్ కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు.., పోలీసులకు ఏ శిక్ష పడుతుందంటే..!

George Floyd Case: జార్జ్ ఫ్లాయిడ్ కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు.., పోలీసులకు ఏ శిక్ష పడుతుందంటే..!

జార్జి ఫ్లాయిడ్ కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు

అగ్రరాజ్యం అమెరికాలో (America) సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో (George Floyd Murder Case) కోర్టు కీలక తీర్పు.

  • Share this:
అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్డ్ ఫ్లాయిడ్‌ ఉదంతంలో మిన్నియా పోలిస్ అధికారి డెరెక్ చౌవిన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఆఫ్రికన్- అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ను అతడు హత్య చేసినట్టు మంగళవారం కోర్టు నిర్ధారించింది. గత కొన్నేళ్లుగా అమెరికాలోని నల్లజాతి వారిపై దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి తీర్పు రావడం విశేషం. 12 మంది సభ్యుల జ్యూరీ చౌవిన్‌ను ఈ కేసులో దోషిగా గుర్తించింది. సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్య, నరహత్య ఆరోపణలకు సంబంధించి అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో 45 మంది సాక్షులు, పోలీసు అధికారులు, వైద్య నిపుణుల వాంగ్మూలం తీసుకున్నారు. సోమవారం ప్రారంభమైన విచారణ పది గంటల్లో ముగిసింది. గత ఏడాది మే 25న, నకిలీ కరెన్సీ ఉపయోగించాడనే ఆరోపణలతో నల్లజాతీయుడైన జార్డ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో బాధితుడిని రోడ్డుపై మోకాలితో తొక్కి పట్టారు. దాదాపు తొమ్మిది నిమిషాలు ఫ్లాయిడ్ మెడపై డెరెక్ చౌవిన్‌ అనే శ్వేతజాతి పోలీసు అధికారి మోకాలితో బలంగా నొక్కి పెట్టాడు. తనకు ఊపిరి ఆడట్లేదని బాధితుడు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఫ్లాయిడ్ కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. గత ఏడాది మే 25న జరిగిన ఈ దారుణమైన ఘటనపై అమెరికాలోని నల్లజాతీయులు తీవ్రంగా స్పందించారు.

నల్లజాతీయుల హర్షాతిరేకాలు
ఈ కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంగా కొన్ని వందల మంది నల్లజాతీయులు కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితుడు హత్యకు పాల్పడ్డట్లు తీర్పు వచ్చిన తరువాత వీరంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొడుతూ, కార్ల హారన్లు మోగిస్తూ నినాదాలు చేశారు. అమెరికా సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయాలకు కోర్టులు శిక్ష విధించడం గొప్ప విషయమని పలువురు తెలిపారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కోర్టులు న్యాయం చేస్తాయని బాధితుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు.



గీత దాటిన నిందితుడు
విధుల నిర్వహణలో హింసకు పాల్పడటంపై యూఎస్ క్రిమినల్ న్యాయ వ్యవస్థ పోలీసులకు ఎక్కువ అధికారాలు కల్పించింది. కానీ ఈ కేసులో చౌవిన్ తన అధికారాలను ఉల్లంఘించారని, గీతదాటి ప్రవర్తించారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అతడికి కనీసం పన్నెండున్నర సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయమూర్తుల జ్యూరీలో ఆరుగురు శ్వేతజాతీయులు (వీరిలో నలుగురు మహిళలు), నలుగురు నల్లజాతీయులు (వీరిలో ఒక మహిళ), ఇద్దరు బహుళ జాతి మహిళలు ఉన్నారని కోర్టు రికార్డులు చెబుతున్నాయి.

హత్యగా నిర్ధారించిన వైద్యులు
జార్జ్ ఫ్లాయిడ్‌ది హత్యేనని పోస్టుమార్టం నివేదిక సైతం వెల్లడించింది. అతడు ఆక్సిజన్ అందక, ఊపిరి ఆడక చనిపోయాడని వైద్య నిపుణుల బృందం తెలిపింది. దీనికి తోడు హత్య జరిగిన రోజున తీసిన వీడియోలు, సాక్ష్యుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఫ్లాయిడ్ మృతికి ఇతర కారణాలు ఉండవచ్చని చౌవిన్ తరఫు లాయర్లు వాదించారు. కానీ ఈ వాదనను న్యాయమూర్తులు ఖండించారు.

ఈ కేసులో తీర్పు వెలువడినప్పుడు నిందితుడి మొహంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. చౌవిన్‌ బెయిల్‌ రద్దు చేసిన తరువాత, అతడిని హెన్నెపిన్ కౌంటీ షెరీఫ్ అదుపులో ఉంచారు. మరికొన్ని రోజుల్లో అతడికి విధించాల్సిన శిక్షపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పోలీసులపై త్వరలో విచారణ ప్రారంభం కానుంది.
First published:

అగ్ర కథనాలు