హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...

శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...

శ్రీలంక విషాదంపై ప్రతీకాత్మక చిత్రం

శ్రీలంక విషాదంపై ప్రతీకాత్మక చిత్రం

Sri Lanka Bomb Blast Update : శ్రీలంకలో వచ్చే వారం మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా తాజాగా హెచ్చరికలు పంపింది.

  శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండగ రోజున చర్చిలు, హోటళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 253 మంది చనిపోయారని స్పష్టం చేసింది ఆ దేశ ప్రభుత్వం. నిన్నటి వరకూ మృతుల సంఖ్యను 359 మందిగా చెప్పిన ప్రభుత్వం... ఉన్నట్టుండి లెక్క మార్చింది. మృతుల సంఖ్యను 100కు పైగా తగ్గించింది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుంటే... తాజాగా ఈ మృతుల సంఖ్యలోనూ గందరగోళమేనా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మృతులను లెక్కపెట్టడం అంత ఈజీ కాదన్న శ్రీలంక ప్రభుత్వం... అసలు చాలా మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయని, ఏ భాగం ఎవరిదో లెక్క తేల్చడం కష్టమైందని చెప్పింది. అందువల్ల లెక్క తేడా వచ్చిందనీ, ఇప్పుడు చెప్పిన 253 మాత్రం అత్యంత కచ్చితమైన లెక్క అని తేల్చింది.


  శ్రీలంకలో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని అమెరికా మరోసారి హెచ్చరించింది. మరోసారి ప్రార్థనా స్థలాలపైనే దాడులు జరిగే ప్రమాదం ఉందని చెప్పింది. ఈ నెల 28 వరకూ కొలంబోలోని ప్రార్థనాలయాలకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో ఉండవద్దని ప్రజలను హెచ్చరించింది. ఉగ్రదాడులపై ఇంటర్ పోల్, స్కాట్లాండ్ యార్డ్, FBI తోపాటూ 6 విదేశీ పోలీస్ ఏజన్సీలు లంక పోలీసులు, సైన్యం దర్యాప్తుకు సహకరిస్తున్నాయి.


  బాంబు పేలుళ్లతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న శ్రీలంక ప్రభుత్వం గురువారం నుంచీ చర్చిలను మూసివేసింది. తిరిగి ఎప్పుడు తెరిచేదీ త్వరలో ప్రకటిస్తామంది. అలాగే... అరైవల్ వీసాల జారీ నిలిపివేసింది. నిజానికి మే 1 నుంచీ 39 దేశాల ప్రజలకు అరైవల్ వీసాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి బాలేకపోవడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు శ్రీలంక టూరిజం మంత్రి జాన్ అమరతుంగ. ఒకవేళ అరైవల్ వీసాలు ఇచ్చినా ఆ దేశం వెళ్లేందుకు పర్యాటకులు సిద్ధపడట్లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నవారు సైతం తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఈస్టర్ ముందు వరకూ పర్యాటకులతో కళకళలాడిన శ్రీలంక ఇప్పుడు బోసిపోతోంది.


   


  ఇవి కూడా చదవండి :


  జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు... సమ్మర్‌లో రిలాక్స్...


  అవెంజర్స్‌కి షాక్... రిలీజ్‌కి రెండ్రోజుల ముందే పైరసీలో సినిమా మొత్తం రిలీజ్...


  పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...


  మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...

  First published:

  Tags: America, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism, USA, World

  ఉత్తమ కథలు