హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

George floyd case: పాపం పండింది.. జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు జైలు శిక్ష.. ఎన్నేళ్లో తెలుసా?

George floyd case: పాపం పండింది.. జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు జైలు శిక్ష.. ఎన్నేళ్లో తెలుసా?

George floyd case: జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు జైలు శిక్ష..

George floyd case: జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు జైలు శిక్ష..

George floyd murder case: 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ మినెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నగరానికి చెందినవారు. గత ఏడాది మే 25న ఆయన హత్యకు గురయ్యారు. ఓ కేసులో పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలు పెట్టి కూర్చోవడంతో.. ఊపిరాడక జార్జ్ ఫ్లాయిడ్ మరణించారు.

ఇంకా చదవండి ...

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చింది. నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌పై కర్కశంగా వ్యవహరించి, అతడి మరణానికి కారణమైన అమెరికన్ పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌ను కోర్టు కఠినంగా శిక్షి విధించింది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన ఈ మాజీ పోలీసుకు అక్కడి కోర్టు 22.5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లాయిడ్ ఉదంతం తరువాత అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్ ఉద్యమం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న నల్ల జాతీయులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. వారిపై పోలీసుల దౌర్జన్యాలు ఆపేయాలని, డెరిక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం అక్కడి కోర్టు కేసుపై తీర్పు ఇచ్చింది. 45 ఏళ్ల డెరిక్‌ చౌవిన్‌కు 22 సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. 15 సంవత్సరాల శిక్ష అనుభవించిన తరువాత, మంచి ప్రవర్తన ఆధారంగా డెరిక్‌కు పెరోల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది.

46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ మినెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నగరానికి చెందినవారు. గత ఏడాది మే 25న ఆయన హత్యకు గురయ్యారు. నకిలీ నోట్లు మార్చాలని ప్రయత్నించాడనే కేసు విషయంలో అతడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించారు. ఇదే సమయంలో ఫ్లాయిడ్ మెడపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి పట్టారు. ఫలితంగా శ్వాస తీసుకోలేక ఫ్లాయిడ్ కన్నుమూశాడు. ఈ కేసులో డెరిక్‌ను కోర్టు దోషిగా తేల్చింది. తాజాగా ఆయనకు విధించాల్సిన శిక్షను ప్రకటించింది. విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ మరణం విషాదకరమైన ఘటన అని చెప్పారు డెరిక్ తరఫు న్యాయవాది ఎరిక్ నెల్సన్. సంఘటన తరువాత డెరిక్ సైతం ఎంతో వేదన అనుభవించాడని తెలిపాడు. ఫ్లాయిడ్ కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నట్లు డెరిక్ కోర్టులో చెప్పాడు.

ప్రాసిక్యూటర్ మాథ్యూ ఫ్రాంక్ మాత్రం డెరిక్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరారు. నిందితుడు ఫ్లాయిడ్‌ను దారుణంగా హింసించాడని చెప్పాడు. ‘డెరిక్ తుపాకీతో కాల్చి ఒక్క నిమిషంలో ఫ్లాయిడ్‌ను చంపలేదు. బాధితుడిపై అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ప్రాణాల కోసం వేడుకుంటున్న నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అతి దారుణంగా తొమ్మిదిన్నర నిమిషాలు వేధించాడు. ఫ్లాయిడ్‌కు ఊపిరి ఆడకుండా చేసి, క్రూరత్వాన్ని ప్రదర్శించాడు’ ఫ్రాంక్ కోర్టుకు తెలిపాడు. అందువల్ల ఈ ప్రత్యేక కేసులో సంబంధిత మార్గదర్శకాలకు మించి శిక్ష విధించాలని జడ్జిని కోరాడు.

చౌవిన్ ఫ్లాయిడ్‌పై క్రూరత్వంగా ప్రవర్తించాడని, అధికారాన్ని దుర్వినియోగం చేశాడని జడ్జి పీటర్ కాహిల్ తెలిపారు. ‘ఈ తీర్పు భావోద్వేగాలతో, సానుభూతితో ఇచ్చింది కాదు. ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు’ అని జడ్జి వ్యాఖ్యానించారు.

* ఎవరెవరు ఎలా స్పందించారు?

విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ సోదరుడు టెరెన్స్ ఫ్లాయిడ్ మాట్లాడుతూ.. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారకులైనవారికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కోరారు. తీర్పు తరువాత ఫ్లాయిడ్ ఏడేళ్ల కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడింది. ‘మా నాన్నను నేను చాలా మిస్ అవుతున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం’ అని ఫ్లాయిడ్ కుమార్తె జియానా బాధపడుతూ చెప్పింది. డెరిక్ తల్లి కరోలిన్ పావ్లెంటీ మాత్రం కోర్టు తీర్పు తరువాత భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడిని కేసులో అన్యాయంగా ఇరికించారని, జాత్యహంకారిగా ముద్ర వేశారని ఆరోపించారు. తన కొడుకు మంచి వ్యక్తి అని కోర్టు గుర్తించాలని కోరారు.

తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పౌర హక్కుల సంఘాలు, ప్రముఖులు సైతం కోర్టు తీర్పుపై స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టు సరైన శిక్ష విధించిందని ఫ్లాయిడ్ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

First published:

Tags: America, Crime news, International news, Us news

ఉత్తమ కథలు