H-1B visa: భారతీయ టెక్కీలకు గుడ్​న్యూస్​.. హెచ్​1బీ వీసాల కోసం రెండోసారి లాటరీ.. ఎంతమందికి ఇస్తారంటే..

ప్రతీకాత్మక చిత్రం

H-1B visa: వచ్చే ఆర్థిక సంవత్సరం 2021 అక్టోబర్​ నుంచి 2020 సెప్టెంబర్​ 30 కాలానికి గాను హెచ్​1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందిని లాటరీ విధానంలో ఎంపిక చేశారు.

  • Share this:
భారతీయ టెక్కీలకు గుడ్​న్యూస్ చెప్పింది అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ ఏజెన్సీ. మొదటిసారి లాటరీతో హెచ్​1బి వీసాకు ఎంపిక కాని వారికి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్​సీఐఎస్​ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రధానంగా భారతీయ టెక్​ నిపుణులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన హెచ్​1బీ లాటరీ విధానంలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున జూలై 28న మరికొందరిని ర్యాండమ్​ సెలక్షన్​ ప్రాసెస్​లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్​ ఫైలింగ్​ ప్రక్రియ నవంబర్​ 3 తో ముగియనున్నట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది.

ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం 2021 అక్టోబర్​ నుంచి 2020 సెప్టెంబర్​ 30 కాలానికి గాను హెచ్​1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందిని లాటరీ విధానంలో ఎంపిక చేశారు. అయితే మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయారు. కాబట్టి, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహించాలని యూఎస్​సీఐఎస్​ నిర్ణయించింది. తద్వారా అదనంగా వందల మంది టెక్కీలకు హెచ్​1 బీ వీసా దక్కే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రధానంగా స్టెమ్​–ఓపీటీ విద్యార్థులకు భారీ ఊరటగా చెప్పవచ్చు.

హెచ్​1బీ సెకండ్​ లాటరీకి ఎవరు అర్హులు?
2022 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్లకు ఎంపిక చేసిన అభ్యర్థులు మాత్రమే రెండవ లాటరీకి పిటిషన్లు దాఖలు చేసేందుకు అర్హులని యుఎస్​సీఐఎస్ తెలిపింది. అయితే, పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన అది కచ్చితంగా ఆమోదం పొందుతుందని చెప్పలేమని తెలిపింది.

పిటిషన్లు ఎలా దాఖలు చేయాలి?
H-1B క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను యూఎస్సీఐఎస్ సర్వీస్​సెంటర్లలో దాఖలు చేయాల్సి ఉంటుంది. నోటీసులో సూచించిన వివరాలను పొందుపర్చాలి. పిటిషనర్లు సంబంధిత H-1B పిటిషన్‌లను ఆఫ్​లైన్​​ విధానంలోనే దాఖలు చేయాలి. ఆన్​లైన్​ పిటిషన్లను అనుమతించరు. FY 2022 హెచ్​1బి క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌కు అర్హత గల రిజిస్ట్రేషన్ కాపీని కూడా జతచేయాలి. హెచ్​1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్​ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంతో గతంలో మాదిరిగానే సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్​ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.

ప్రతి సంవత్సరం 85 వేల కొత్త హెచ్1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం జారీ చేస్తుంది. అక్కడి ఎమ్​ఎన్​సీ కంపెనీల సిఫార్సుల మేరకు అమెరికా ప్రతి ఏడాది 65 వేల మంది విదేశీ ఐటీ నిపుణులకు హెచ్​1బీ వీసాలు జారీ చేస్తోంది. వీటికి అదనంగా అక్కడే విద్యాభ్యాసం​ చేసిన 20 వేల మాస్టర్​ క్యాప్​ వీసాలు జారీచేస్తుంది. ఈ వీసాలు దక్కించుకునే వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం.
Published by:Kishore Akkaladevi
First published: