హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump: హాంగ్ కాంగ్ ఇష్యూలో చైనాను ఇరుకున పెట్టేందుకు ట్రంప్ వ్యూహం...

Donald Trump: హాంగ్ కాంగ్ ఇష్యూలో చైనాను ఇరుకున పెట్టేందుకు ట్రంప్ వ్యూహం...

చైనీస్ అధికారిక మీడియా ఈ కామెంట్ చేసినా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అసలు చైనా నుంచే కరోనా వచ్చిందని, అక్కడి ప్రయోగశాల నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.

చైనీస్ అధికారిక మీడియా ఈ కామెంట్ చేసినా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అసలు చైనా నుంచే కరోనా వచ్చిందని, అక్కడి ప్రయోగశాల నుంచి కరోనా వైరస్ లీక్ అయిందంటూ అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.

హాంకాంగ్ సమస్యపై చైనా విధానాన్ని తూర్పార పట్టారు. హాంకాంగ్‌లో ఒత్తిడి విధానాలను అమలు చేస్తోందని, చైనా పాలకులు తీరును ట్రంప్ విమర్శించారు. హాంకాంగ్ కు ఇప్పటివరకు ఇచ్చిన వ్యాపార రాయితీలను ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఇంకా చదవండి ...

అప్పుడు కరోనా వైరస్ ఇప్పుడు హాంకాంగ్ ఈ రెండు విషయాల్లో చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా సరికొత్త ఫ్రంట్ తెరిచారు. అంతేకాదు ట్రంప్, ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా నియంత్రిస్తోందని విమర్శించడంతో పాటు, ఐరాస ఆరోగ్య సంస్థతో అమెరికా సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో, చైనాపై కూడా కొత్త ఆంక్షలు ప్రకటించారు. ఇందులో, హాంకాంగ్‌లో పరిపాలనకు బాధ్యత వహించే చైనా అక్కడ ప్రజా ఉద్యమానికి ఆంక్షలు విధించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, అనేక రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక కరోనా వైరస్ తీవ్రతను ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేయడంలో చైనా అధికారులు తమ జవాబుదారీతనం విస్మరించారని ట్రంప్ అన్నారు. ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చారు. చైనాలో కరోనా వైరస్ ను మొదటిసారిగా గుర్తించినప్పటి నుండి, మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీ ఆర్థిక నష్టాలు సంభవించాయి.

అటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనాకు పూర్తి నియంత్రణ ఉందని, చైనా కేవలం 40 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తుంటే. అమెరికా WHOకు 45 మిలియన్ డాలర్ల సహాయం చేస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వద్ద ఉన్నతాధికారులతో పాటు మీడియాతో అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ట్రంప్ అన్నారు. తమ సిఫార్సులను పట్టించుకోవడం లేదని, అటువంటి పరిస్థితిలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో తన సంబంధాన్ని ముగించాలని అమెరికా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

అటు ట్రంప్ మరో ఆరోపణ చేస్తూ కరోనా వైరస్ చైనా రాజధాని బీజింగ్ లేదా షాంఘై లాంటి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా....వుహాన్ నుండి వైరస్ నేరుగా యూరప్, అమెరికాకు ఎందుకు వ్యాపించింది అని ప్రశ్నించారు. ఈ వైరస్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం చాలా పెద్దదని, దీని కోసం చైనా ప్రపంచాని ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఇక చైనా సరిహద్దు వివాదం, దక్షిణ చైనా సముద్రం వివాదం గురించి అధ్యక్షుడు ట్రంప్ లేవనెత్తగా, చైనా హాంకాంగ్ ను సాకుగా చూపి ముట్టడి చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు పలు ఆంక్షలను ప్రకటించారు. చైనా మోసం చేశారని ఆరోపించారు. ఈ ఎపిసోడ్ లో, ట్రంప్ చైనీయులు తమ ముఖ్యమైన అమెరికన్ విశ్వవిద్యాలయ పరిశోధనా సంస్థల్లో విధులు నిర్వర్తిండం భద్రతా ముప్పుగా పరిగణించారు. అదే సమయంలో, అమెరికాలోని చైనా కంపెనీలపై ఆర్థిక పనుల దర్యాప్తును రాష్ట్రపతి ప్రత్యేక వర్కింగ్ గ్రూపునకు ఇవ్వాలని నిర్ణయించారు.

అదే సమయంలో, హాంకాంగ్ సమస్యపై చైనా విధానాన్ని తూర్పార పట్టారు. హాంకాంగ్‌లో ఒత్తిడి విధానాలను అమలు చేస్తోందని, చైనా పాలకులు తీరును ట్రంప్ విమర్శించారు. హాంకాంగ్ కు ఇప్పటివరకు ఇచ్చిన వ్యాపార రాయితీలను ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. అదే సమయంలో, హాంకాంగ్ కోసం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ యొక్క ట్రావెల్ అడ్వైజరీని కూడా మార్చాలని నిర్ణయించారు. అధ్యక్షుడు ట్రంప్ హాంకాంగ్‌లో పెరుగుతున్న నిఘా, గూఢచర్యం నిర్ణయం వెనుక ఒక కారణమని పేర్కొన్నారు.

First published:

Tags: Donald trump, US-China

ఉత్తమ కథలు