మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి... ఐరాసలో అమెరికా ప్రతిపాదన

Masood Azhar : నరనరాల్లో భారత్ పట్ల వ్యతిరేక భావజాలం ఉన్న మసూద్ అజార్ ఉగ్రవాద చర్యలతో వందల మంది భారతీయుల ప్రాణాలు తీశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 28, 2019, 11:40 AM IST
మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి... ఐరాసలో అమెరికా ప్రతిపాదన
మసూద్ అజార్
Krishna Kumar N | news18-telugu
Updated: March 28, 2019, 11:40 AM IST
బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో ఐక్యరాజ్యసమితిలోని 15 సభ్యుల భద్రతా మండలిలో అమెరికా ఓ ప్రతిపాదన తెచ్చింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నది ఆ ప్రతిపాదన ఉద్దేశం. అది అమలైతే ఇక మసూద్ అజార్ ఆయుధాల అక్రమ రవాణా చెయ్యలేడు. అలాగే అతనిపై ట్రావెల్ బ్యాన్ అమలవుతుంది. అతని ఆస్తుల్ని ఫ్రీజ్ చేస్తారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న జేషేను నిలువరించేందుకు రెండు వారాల కిందట అమెరికా ఇలాంటి ప్రతిపాదనే తీసుకురాగా... చైనా దాన్ని అడ్డుకుంది. ఫిబ్రవరి 14న జమ్మూలోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి వెనక ఉన్నది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థే. ఈ దాడిలో స్పాట్‌లో 40 మంది పారామిలిటరీ దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్‌లో 30 ఏళ్లుగా జరుగుతున్న వేర్పాటు వాద ఉద్యమంలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. దీని వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు యుద్ధం చేసుకునేంత దాకా వెళ్లింది పరిస్థితి.

ఇస్లామిక్ దేశాల్లో ఏ సంస్థపైనైనా, ఏ వ్యక్తిపైనైనా చర్యలు తీసుకునే అధికారం ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ అండ్ అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీకి ఉంది. ఈ కమిటీకి రెండు వారాల కిందట అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంతో... మసూద్ అజార్‌ను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టలేకపోయారు. చైనా 2016, 2017లో కూడా ఇలాగే అడ్డుకుంది. బ్లాక్ లిస్టులో పెట్టాలంటే కచ్చితమైన ఆధారాలు ఉండాలని లేనిపోని వంకలు పెడుతోంది.


అమెరికా ప్రతిపాదన అమలవ్వాలంటే... దానికి అనుకూలంగా 9 ఓట్లు రావాల్సి ఉంటుంది. అంతేకాక... భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల్లో ఏ ఒక్కటీ దానిపై వీటో అధికారాన్ని ప్రయోగించకూడదు. తాజా ప్రతిపాదనపై ఎప్పుడు ఓటింగ్ పెడతారన్నది ఇంకా తేలలేదు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు.

జైషే మహ్మద్ సంస్థను 2001లోనే ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ ఏడాది డిసెంబర్‌లో జైషే ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడికి దిగారు. అది భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇప్పుడు మసాద్ అజార్‌ను నిలువరించకపోతే ప్రపంచానికే ప్రమాదమని భావిస్తున్న అమెరికా... ఆ దిశగా ప్రయత్నిస్తోంది.



 

ఇవి కూడా చదవండి :

ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల... అమ్మాయిల ఫొటోలు, డబ్బులు అడుగుతూ...

ఆఫీస్‌లో కునుకు తీస్తే... ఆరోగ్యానికి మంచిదే... మరి బాసులకో...????

యాపిల్‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే తినకుండా ఉండరు


లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...