అమెరికాకి చెందిన యుద్ధ విమానం.. ఆదివారం ఆకాశంలో ఎగురుతున్న ఓ వస్తువును షూట్ చేసి, పేల్చేసింది. 8 కోణాలతో ఉన్న ఆ వస్తువు.. అమెరికా, కెనడా సరిహద్దులో హరోన్ సరస్సు (Lake Huron)పై ఎగురుతూ కనిపించింది. ఈమధ్యకాలంలో ఇలా జరిగిన ఘటనల్లో ఇది నాలుగోది. గతవారం మొదటిసారి ఓ బెలూన్ ఆకాశంలో కనిపించగా.. దాన్ని కూల్చేసిన అమెరికా.. దాని వెనక చైనా గూఢచర్యం (Chinese spy balloon) ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను కొట్టివేసిన చైనా.. అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది.
అసలే అమెరికన్లకు ఆకాశంలో కనిపించే వస్తువుల గురించి మాట్లాడుకోవడం ఇష్టం. వాళ్లు తరచూ ఫ్లైయింగ్ సాసర్లు (UFO)లు, గ్రహాంతర వాసుల (Aliens) గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమందైతే అలాంటివి కనిపిస్తే బాగుండని చూస్తూ ఉంటారు. వాళ్లు కోరుకున్నట్లుగానే ఇప్పుడు వారంలో నాలుగు వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. నాలుగింటినీ అమెరికా కూల్చేయడమూ జరిగింది. ఇంకా ఎన్ని ఎగురుతాయో తెలియదు.
#BREAKING: Unconfirmed footage of unidentified object hovering over #LakeHuron between Michigan and Ontario, as another object has been shot down.#UFO #ufotwitter pic.twitter.com/fQZegshBYf
— BNL NEWS (@BreakingNLive_) February 12, 2023
తాజా కూల్చివేత వెనక అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) అదేశం ఉందని తెలిసింది. ఆయన ఆర్డర్ రాగానే F-16 ఫైటర్ జెట్ రివ్వున ఆకాశంలో దూసుకెళ్లి.. దాన్ని పేల్చేసింది.
ఈ కొత్త వస్తువు ప్రమాదకరంగా లేదనీ.. దాని వల్ల ఎలాంటి నష్టమూ లేదని అమెరికా తెలిపింది. ఐతే.. అది మిచిగాన్‌పైన ఎగిరివుంటే... అక్కడి ప్రజలకు సమస్య అయ్యేదని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America