అమెరికాలో తుపాకి తూటాలు మళ్లీ విరుచుకుపడ్డాయి. ఇల్లినాయిస్ నగరంలో శనివారం రాత్రి ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. ఇలినాయిస్‌లోని రాక్‌ఫోర్డ్‌లో ఉన్న క్రీడా మైదానంలో ఓ వ్యక్తి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన డాన్ కార్టర్ క్రీడా మైదాన ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్డ్ సిటీ పోలీసులు కోరారు. అయితే కాల్పులు జరిగిన వ్యక్తి గురించి కానీ, బాధితుల గురించి కానీ ఇతర సమాచారం ఏదీ ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్లు ఎవరూ ఈ సందర్భంగా కాల్పులు జరపలేదని ఆయన తెలిపారు.
The scene outside Don Carter Lanes on East State Street where police responded to what they said was an active shooter. We are awaiting a media briefing from Chief Dan O’Shea. @rrstar pic.twitter.com/g9lT8MdfVy
— Ken DeCoster (@DeCosterKen) December 27, 2020
ఈ కాల్పుల్లో చనిపోయిన వారిలో ఇద్దరూ టీనేజర్లు ఉన్నారు. అమెరికాలో కాల్పుల ఘటనలు కొత్తేం కాదు. అయితే, అక్కడ గన్ కల్చర్‌ను తగ్గించే విషయమై రాజకీయంగా ప్రతిష్టంభన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Crime, Crime news, Gun fire