Home /News /international /

AMERICA SCIENTISTS HAVE DISCOVERED A NEW WAY TO MANIPULATE THE HUMAN CELL APPARATUS THE CORONA VIRUS VB

Washington: కరోనాపై అమెరికా శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం.. నకిలీ వైరస్ తో కరోనా వైరస్ కి చెక్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Washington: మానవ కణ యంత్రాంగాలను ఏమార్చి, ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను అంతే యుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవ్తేతలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్‌ను తెరపైకి తెచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    కరోనా వైరస్ దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ప్రతీ ఒక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా బారిన పడిన వారు పోస్ట్ కరోనా సమయంలో కూడా చాలామందికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ విషయంలో అమెరికా శాస్త్రవ్తేతలు కొత్త విధానాన్ని కనిపెట్టారు.
    మానవ శరీరాల్లోకి చొరబడి నక్క జిత్తులతో కణ యంత్రాంగాలను ఏమార్చి, ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను అంతే యుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవ్తేతలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్‌ను తెరపైకి తెచ్చారు. దీనిని ఎలా ఉపయోగిస్తారంటే.. మానవ కణ ఉపరితలానికి అంటుకున్న వైరస్ దగ్గర కృత్రిమ కరోనా వైరస్‌ అతుక్కొని.. ఆ తర్వాత జన్యూ పదర్థాన్ని అందులోకి పంపిస్తుంది. తర్వాత వైరస్ కణ వ్యవస్తను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత తన లాంటి కృత్రిమ కరోనా అనేక ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. ఇలా నిజమైన వైరస్ పై లోపభూయిష్టంగా తయారుచేసిన డిఫెక్టివ్‌ ఇంటర్‌ఫియరింగ్‌ (డీఐ) వైరస్‌లతో వీటికి చెక్‌ పెట్టొచ్చని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు.

    ఇవి ప్రవేశించిన కణాల్లో.. అసలైన వైరస్‌ ఉంటే డీఐ వైరస్‌ కూడా పునరుత్పత్తి చేయగలుగుతుంది. ఇందుకోసం అసలైన వైరస్‌ జన్యురాశిలోని పునరుత్పాదక యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఫలితంగా హానికర వైరస్‌ వృద్ధి చెందకుండా అక్కడే ఆగిపోతుంది.

    america scientists, duplicate synthetic coronavirus, defective interfering technology, Pennsylvania State University, coronavirus, covid 19, clone virus, నకిలీ కరోనా, డూప్లికేట్ కరోనా, అమెరికా శాస్త్రవేత్తలు,
    ప్రతీకాత్మక చిత్రం


    ఈ కృత్రిమ కరోనా డీఐ జన్యురాశి చిన్నగా ఉండటం వల్ల అసలు వైరస్‌ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. హానికర వైరస్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు వేగంగా తన సంతతిని పెంచుకుంటుంది. ఫలితంగా 24 గంటల్లోనే అసలైన వైరస్‌కు సంబంధించిన కణాలను చంపడంతో కొంత బరువు తగ్గుతుంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: America, Corona virus

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు