హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Joe Biden On Afghanistan Crisis: ఉగ్రవాదానికి మేము ఎప్పుడూ వ్యతిరేకమే.. ఆఫ్గాన్ సంక్షోభంపై జో బైడెన్ వాఖ్యలు

Joe Biden On Afghanistan Crisis: ఉగ్రవాదానికి మేము ఎప్పుడూ వ్యతిరేకమే.. ఆఫ్గాన్ సంక్షోభంపై జో బైడెన్ వాఖ్యలు

జో బైడెన్ (ఫైల్ ఫొటో)

జో బైడెన్ (ఫైల్ ఫొటో)

ఆఫ్గానిస్తాన్ లో నెలకొన్న సంక్షోభంపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడు జో బైడెన్ స్పందించారు. తాము ఉగ్రవాదానికి ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు.

ఆఫ్గాన్ లో సంక్షోభంపై అగ్రరాజ్యం అమెరికా వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆఫ్గాన్ లో తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తాలిబన్లపై ఆఫ్గాన్ ప్రభుత్వం పోరడలేదని అన్నారు. ఆ ప్రభుత్వానికి తాము మద్దతు ఇచ్చినా ఉపయోగించుకోలేదన్నారు. ఆఫ్ఘాన్ లో సంక్షోభానికి ట్రంప్ వైఖరే కారణమని ఆరోపించారు బైడన్. ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను సైతం బైడెన్ తప్పు పట్టారు. తీవ్రవాదానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని బైడెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేసింది ముమ్మాటికీ తప్పేనని వాఖ్యానించారు బైడెన్. తాను ఇప్పటికే నాలుగు సార్లు అఫ్గానిస్తాన్ లో పర్యటించానని అన్నారు. ఇప్పటివరకు అమెరికా సైన్యానికే తీవ్ర నష్టం జరిగిందన్నారు. భవిష్యత్ లో అమెరికాకు ఏది మంచిదో దానిపైనే దృష్టి పెడతామని బైడెన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ లో ఇప్పటికీ 6 వేల మంది అమెరికా బలగాలు ఉన్నాయని వివరించారు. ఆ దేశ ప్రజలకు తప్పకుండా అమెరికా సాయం చేస్తుందని తెలిపారు. 20 ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కు రావడాన్ని సమర్ధించారు. తాము ఆఫ్ఘాన్ ప్రజలు, మహిళలు మరియు బాలికల ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పౌరుల తరలింపును కాబుల్ ఏర్పాటు నుంచి తరలింపు చర్యలు అడ్డుకోవద్దని తాలిబన్లను బైడెన్ హెచ్చరించారు.

Afghan students: ఇండియాకు అఫ్గాన్ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు.. అనుమతించాలంటూ అభ్యర్థనలు.. వివరాలివే

అమెరికా ఆధీనంలో కాబుల్ ఎయిర్పోర్ట్..

మరో వైపు.. కాబుల్ ఎయిర్పోర్ట్ ను అమెరికా సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. అమెరికన్ల తరలింపునకు అడ్డురావొద్దని తాలిబన్లను హెచ్చరించింది యూఎస్ ఆర్మీ. ఇదిలా ఉంటే ఆఫ్గనిస్తాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ చేసింది. అక్కడి నుంచి స్వదేశానికి రావాలనుకుంటున్న వారు +919717785379 నంబరు కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే.. తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్గానిస్తాన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారణమంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. తాను అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ఆయన అన్నారు. ఆఫ్గాన్ లో ఇలాంటి పరిస్థితుల కల్పనకు కారణమైనందుకు బైడెన్ రాజీనామా చేయాలంటూ ఫైర్ అయ్యారు. అమెరికా హిస్టరీలోనే ఇది ఒక ఫెయిల్యూర్ అంటూ ట్రంప్ తీవ్ర వాఖ్యలు చేశారు.

ఆఫ్గాన్ విషయంలో బైడైన్ చాలా గొప్ప పని చేశారంటూ తనదైన స్టైల్ లో ఎద్దేవా చేశారు. ఆఫ్గాన్ లో సంక్షోభ సమయంలో బైడెన్ వ్యవహరించిన తీరును ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. తాలిబన్లపై చేస్తున్న యుద్ధంపై ఖర్చు చాలా ఎక్కువ అవుతుండడంతో ఆఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కు వచ్చే ప్రక్రియకు ట్రంప్ హయాంలోనే అంటే గతేడాది ఫిబ్రవరిలోనే ఒప్పంది కుదిరింది. అయితే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 31 నాటికే ఆఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.

First published:

Tags: Afghanistan, America, Donald trump, Joe Biden, Taliban

ఉత్తమ కథలు