అమెరికాలోని బ్లాక్ లైవ్స్ మేటర్ శిఖరం వద్ద మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సుప్రసిద్ధ 'ఐ హావ్ ఎ డ్రీం' ప్రసంగం 57 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, మార్టిన్ లూథర్ కింగ్, మాల్కామ్ ఎక్స్ కుమార్తెలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు అమెరికాలో జాతి వివక్షపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య నుండి ప్రారంభమైన బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమం విస్కాన్సిన్‌లోని కేనోషాలో విలియం బ్లేక్‌ను పోలీసు అధికారులు కాల్చి చంపిన తరువాత మరోసారి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నల్ల జాతి సూరీడు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సుప్రసిద్ధ 'ఐ హావ్ ఎ డ్రీం' ప్రసంగం చేసి 57 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఇందులో చాలా మంది మానవ హక్కులు, జాత్యహంకార వ్యతిరేక కార్యకర్తలు, వందలాది మంది మద్దతు దారులు వాషింగ్టన్ లో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె డాక్టర్ బెర్నిస్ కింగ్, మాల్కం X కుమార్తె ప్రొఫెసర్ ఇలియాసా షాబాజ్, క్వామె న్క్రుమా కుమార్తె సమియా న్క్రుమా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె ఏమన్నారంటే...
మార్టిన్ లూథర్ కింగ్ కుమార్తె కింగ్ సెంటర్ సిఇఒ డాక్టర్ బెర్నిస్ కింగ్ మాట్లాడుతూ, బ్లాక్ లివ్స్ మేటర్ ఉద్యమంలో తక్కువ సమయంలో చాలా పురోగతిని చూశామన్నారు. తన తల్లి ఎప్పుడూ సయోధ్య గురించి మాట్లాడేది, కాని ఎవరు ఎలా ఉన్నారనే వాస్తవికతను తాను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నారు. తన తండ్రిని అనవసరంగా చంపి ఉండవచ్చు. కానీ వారిపట్ల తనకు ఎలాంటి ద్వేష భావం లేదన్నారు. ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరూ జీవించడానికి అనువైన ప్రదేశంగా మార్చాలని మాత్రమే ఆయన కోరుకున్నారని గుర్తించారు. సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యం అనేది ఎలా దెబ్బతీస్తుందనే దాని గురించి శోధించాలని, దాన్ని నిరోధించేందుకు ప్రణాళిక, వ్యూహరచన చేయాలన్నారు.
మాల్కం ఎక్స్ కుమార్తె ఏమన్నారంటే...
మాల్కం ఎక్స్ కుమార్తె ప్రొఫెసర్ షాబాజ్ మాట్లాడుతూ ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తేనే అసమానతలు తొలిగిపోతాయన్నారు. మాల్కం ఎక్స్, అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమానికి ప్రసిద్ధ నాయకుడు, ఆయన నల్లజాతీయుల కోసం ఉద్యమించగా, 1965 లో హత్య చేయబడ్డారని గుర్తు చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ భయంకరమైన హత్య ద్వారా ప్రాథమికంగా మనమందరం ఇంట్లో మనల్ని మనం రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే అలాంటి లెక్కలేనన్ని మరణాలు ఉన్నాయన్నారు. మాల్కం ఎక్స్ మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని గుర్తు చేశారు. ఘనా కన్వెన్షన్ పీపుల్స్ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉన్న సమియా న్క్రుమా మాట్లాడుతూ తన తండ్రి ఘనా మాజీ అధ్యక్షుడు పాన్-ఆఫ్రికనిజం కోసం జీవితం ధారపోశారని గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump