H 1B వీసాల్లో భారీ మార్పులు తీసుకొస్తున్న అమెరికా..!

H 1B వీసాల జారీ ప్రక్రియలో ఉపాధి నిర్వచనాన్ని మార్చనున్నారు. దీంతో అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్లు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు, వారు స్థాపించిన ఐటీ రంగంలోని చిన్న మధ్య తరహా కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.

news18-telugu
Updated: October 18, 2018, 11:59 AM IST
H 1B వీసాల్లో భారీ మార్పులు తీసుకొస్తున్న అమెరికా..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హెచ్ 1బీ వీసా. అమెరికా కలలుగనే యువతకు, ఉద్యోగులకు బాగా తెలిసిన పేరు. ఈ వీసా కోసం ఎదురుసూస్తు... అమెరికా
అనుమతివ్వ‌గానే రెక్కలుక‌ట్టుకుని అక్కడ వాలిపోతారు. అలాంటి వీసా హెచ్ 1బీపై ఉక్కుపాదం మోపింది అమెరికా. అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలు ద‌క్కాల‌న్న నినాదంతో ట్రంప్ ఇదివరకే ఈ హెచ్ 1బీ వీసా విధానాల్లో మార్పులు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతుంది ట్రంప్ ప్రభుత్వం. ఈ మేరకు హెచ్ 1బీ వీసా విధానంలో మార్పలుకు ఆదేశాలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

H 1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్రతిపాదనలు తీసుకురానున్నారు. H 1B వీసాల జారీ ప్రక్రియలో ఉపాధి నిర్వచనాన్ని మార్చనున్నారు. ఇది ఖచ్చితంగా ఇండియన్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతేకాదు అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్లు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు, వారు స్థాపించిన ఐటీ రంగంలోని చిన్న మధ్య తరహా కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. జనవరి 2019 కల్లా అమెరికా పౌరసత్వం, మరియు ఇమ్మిగ్రేషన్ విధానంపై కొత్త ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది.

స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఇప్పటి వరకు ఉన్న నిర్వచనంలో మార్పులు చేసి కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించేందుకు సిద్ధమవుతుంది అగ్రరాజ్యం. అంతేకాదు ఉపాధి, ఉద్యోగి నిర్వచనాలను కూడా మార్చి తద్వారా ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత అమెరికన్లకే వచ్చేలా మార్పులు చేయనుంది ట్రంప్ సర్కార్. ఇందుకు అదనంగా H 1B వీసాదారులకు వచ్చే జీతభత్యాలపై కూడా ఒక నిర్ణయం తీసుకోనుంది. H 1B నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కు సంబంధించి H 4 కలిగిన వారి భాగస్వాములకు ఉద్యోగాలు రాకుండా కొన్ని చర్యలు కూడా తీసుకునేందుకు రెగ్యులేషన్స్‌లో మార్పులు చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ తెలిపింది.

H 1Bకోసం దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాంను ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు తీసుకొస్తోంది.
దీని ద్వారా లాటరీ నిర్వహణ విధానం సరళతరం అవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినంక... ఐటీ సెక్టార్ పై ఉక్కుపాదం మోప‌డం ప్రారంభించాడు. అమెరికాకు ఎక్కువ మంది ఐటీ సెక్టార్ నుంచే వలస వస్తున్నరన్నది అమెరికా అనుమానం. ముందుగా దాన్ని కంట్రోల్ చేయ‌డానికే ఇలా వరుసగా ఐటీ సెక్టార్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారనేది నిపుణుల వాదన .
Published by: Sulthana Begum Shaik
First published: October 18, 2018, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading