• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • AMERICA IS MY BIGGEST ENEMY KIM JONG UN SENSATIONAL COMMENTS BEFORE JOE BIDEN OATH TAKING HSN

Kim Jong Un: జో బైడెన్ పేరెత్తకుండానే.. ఉత్తర కొరియాకు అతిపెద్ద శత్రువు ఎవరో ప్రకటించిన కిమ్ జాంగ్

కిమ్ జొంగ్ ఉన్ (ఫైల్)

తాజాగా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న తరుణంలో మరోసారి కిమ్ జాంగ్ అమెరికాపై విరుచుకుపడ్డారు. అగ్రరాజ్యం అధిపతిగా ఎవరు ఉన్నా సరే, అమెరికాపై తమ విధానం మారదని కిమ్ చెప్పుకొచ్చారు. అణు జలాంతర్గాములను తయారు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. నీటిలో కూడా ప్రయోగించగలిగేలా అస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ పేరెత్తకుండానే కిమ్ జాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Share this:
    వాషింగ్టన్/ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన కామెంట్స్ చేశారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో అగ్రరాజ్యమే టార్గెట్ గా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాయే మాకు అతి పెద్ద శత్రువు అని కిమ్ జాంగ్ ప్రకటించారు. మొన్నటి వరకు అణు పరీక్షలు చేస్తూ, కొద్ది కాలంగా అణ్వాయుధాల తయారీకి బ్రేక్ ఇచ్చిన కిమ్ జాంగ్ మరోసారి వాటి గురించి ప్రస్తావించారు. అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకు మరింత శక్తివంతమైన ఆయుధాల్ని సమకూర్చుకుంటామని తేల్చిచెప్పారు. పార్టీ సమావేశంలో పాల్గొన్న కిమ్ జాంగ్, అమెరికా గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

    ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన తొలినాళ్లలో కిమ్ జాంగ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర కొరియాపై ఆంక్షలను కూడా విధించారు. ఓ తరుణంలో అయితే ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తుందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. చివరకు ఊహించని రీతిలో వారిద్దరి మధ్య భేటీ జరగడం, ఆ తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలకు తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగాయి. తాజాగా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న తరుణంలో మరోసారి కిమ్ జాంగ్ అమెరికాపై విరుచుకుపడ్డారు. అగ్రరాజ్యం అధిపతిగా ఎవరు ఉన్నా సరే, అమెరికాపై తమ విధానం మారదని కిమ్ చెప్పుకొచ్చారు. అణు జలాంతర్గాములను తయారు చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. నీటిలో కూడా ప్రయోగించగలిగేలా అస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ పేరెత్తకుండానే కిమ్ జాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    కాగా, ఉత్తర కొరియాపై మీ విధానం ఎలా ఉంటుందని ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానమిచ్చిన బైడెన్ ’కిమ్ తీవ్రమైన నియంత. ఆయన్ను కలిసి ట్రంప్ తప్పు పనిచేశారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చల ద్వారా ట్రంప్ ఏం సాధించారు. నేనయితే ముందస్తు షరతులు ఏమీ లేకుండా కిమ్ జాంగ్ ను అస్సలు కలవను. ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చేవాడిని‘ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వల్లే కిమ్ జాంగ్ మరోసారి అమెరికాపై మాటల తూటాలు పేల్చుతున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: