AMERICA FEDERAL TRADE COMMISSION HITS TIKTOK WITH RECORD 5 7 MILLION FINE OVER CHILDRENS PRIVACY NK
కష్టాల్లో టిక్ టాక్ యాప్... రూ.40 కోట్ల ఫైన్ వేసిన అమెరికా
ప్రతీకాత్మక చిత్రం
Tik Tok App : ప్రజలు చూస్తున్నారు కదా అని రూల్స్ గాలికి వదిలేసి... ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు కదా. టిక్ టాక్ యాప్ చేతులారా చేసుకున్న తప్పిదాలకు భారీ ఫైన్ చెల్లించక తప్పని పరిస్థితి తలెత్తింది.
ఇండియా లాంటి దేశాల్లో రూల్స్ ఉన్నా బ్రేక్ చేసేవాళ్లే ఎక్కువ. భారతీయలకు అంతటి స్వేచ్ఛ ఉంటుంది. అమెరికాలో అలా కుదరదు కదా. అక్కడి స్ట్రిక్ట్ రూల్స్ ఎవరైనా సరే పాటించాల్సిందే. లేదంటే ఫైన్లు కట్టాల్సిందే. చైనా యాప్ టిక్ టాక్ అదే జరుగుతోంది. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ యాప్... టాలెంట్ ఉన్నవారు చెలరేగిపోండని అవకాశం ఇచ్చింది. దాంతో చాలా మంది తమ టాలెంట్ చూపిస్తూ... ఈ యాప్‌ని వాడుకుంటున్నారు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువవుతోంది. ఓవర్ ఎక్స్పోజింగ్, బూతుల గోల పెరిగిపోయింది. ఈమధ్య ఓ కుర్రాడు టిక్ టాక్‌లో వీడియో తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా... టిక్ టాక్ యాప్‌కి షాకిచ్చింది. రూల్స్ పాటించనందుకు రూ.40.6 కోట్ల ఫైన్ వేసింది.
ఈమధ్యే అమెరికా మార్కెట్‌కు వెళ్లింది టిక్ టాక్. అక్కడి మ్యూజికల్.ఎల్వై కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఇండియాలోలాగే... అమెరికాలో కూడా త్వరగానే క్లిక్కైంది. అక్కడి ఆండ్రాయిడ్ మార్కెట్లో ఫోర్త్ పొజిషన్లో నిలిచింది. కానీ అమెరికా చట్టాల ప్రకారం... 13 ఏళ్లలోపు పిల్లల పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాల్ని బయటపెట్టకూడదు. ఒకవేళ పిల్లలే స్వయంగా బయటపెడితే, తమకెలాంటి సంబంధమూ లేదన్న కండీషన్ ముందుగానే చెప్పుకోవాలి. టిక్ టాక్ అవేవీ చెయ్యకుండా ఊరుకుంది. ఫలితంగా చాలా మంది పిల్లలు టిక్ టాక్‌లో కనిపిస్తూ... సందడి చేశారు. ఇది జాతీయ పిల్లల భద్రతా చట్టాన్ని అతిక్రమించినట్లేనన్న అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్... ఫైన్ వేసేసింది.
టిక్ టాక్ మాత్రం ఫైన్ కట్టేది లేదంటోంది. తాము రూల్స్ ప్రకారమే నడుస్తున్నామని చెబుతోంది. అసలు 13 ఏళ్లలోపు పిల్లలకు టిక్ టాక్‌లో పూర్తిగా అనుమతి ఇవ్వలేదనీ, యూజర్ల సేఫ్టీపై అన్ని చర్యలూ తీసుకున్నామని అంటోంది. ట్రేడ్ కమిషన్ ఇవేవీ పట్టించుకోవట్లేదు. ఫైన్ కట్టాల్సిందే అంటోంది. ప్రస్తుతం అమెరికాలో 6.5 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారు. వాళ్లలో చాలా మంది పిల్లలూ ఉన్నారు. ఫైన్ కట్టకపోతే టిక్ టాక్ యాజమాన్యం జైలుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఇది ఆ యాప్‌కి కోలుకోలేని దెబ్బే అంటున్నారు సోషల్ మీడియా ఎనలిస్టులు. ప్రస్తుతం టిక్ టాక్ పిల్లల వీడియోల అప్లోడింగ్ను నిలిపివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.