ట్రంప్ ఇఫ్తార్ విందును బహిష్కరించిన ముస్లింలు

రంజాన్ మాసంలో ముస్లింలకు వైట్ హౌజ్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వడం..అమెరికాలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.  1990లో బిల్ క్లింటన్ హయాంలో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వైట్‌హౌజ్‌లో  ఇఫ్తార్ సంప్రదాయాన్నిరద్దు చేశారు.

Shiva Kumar Addula | news18
Updated: June 7, 2018, 10:47 AM IST
ట్రంప్ ఇఫ్తార్ విందును బహిష్కరించిన ముస్లింలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • News18
  • Last Updated: June 7, 2018, 10:47 AM IST
  • Share this:
ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక  వైట్ హౌజ్‌లో తొలిసారి అధికారికంగా ఇఫ్తార్ విందును  ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే భారీగా ఏర్పట్లు కూడా చేశారు. ఐతే ట్రంప్ ఇవ్వబోయే విందును మెజార్టీ ముస్లిం సంఘాలు బహిష్కరించాయి. ట్రంప్ ఇచ్చే విందు మాకు అక్కర్లేదంటూ ఇఫ్తార్ పార్టీకి దూరంగా ఉంటున్నాయి.

రంజాన్ మాసంలో ముస్లింలకు వైట్ హౌజ్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వడం..అమెరికాలో చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది.  1990లో బిల్ క్లింటన్ హయాంలో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. కానీ 1805లోనే థామస్ జెఫర్సన్ ఆ సంప్రదాయాన్ని తెచ్చారని చెబుతుంటారు. ఐతే ట్రంప్ అధికారంలోకి వచ్చాక వైట్‌హౌజ్‌లో  ఇఫ్తార్ సంప్రదాయాన్నిరద్దు చేశారు.

మరి ఉన్నఫళంగా ఏమైందో ఏమో గానీ.. ఈసారి ఇఫ్తార్ విందు ఉంటుందని వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. ఆ ప్రకటన చూసి ముస్లిం సంఘాలు ఆశ్యర్యం వ్యక్తం చేశాయి. " పలు ముస్లిం సంఘాల తరపున 30-40 మంది ఇఫ్తార్ విందుకు హాజరవుతారు. దానికి ఏర్పాట్లు చేశాం." అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. ఐతే ముస్లిం సంఘాలు ఇఫ్తార్ పార్టీకి దూరంగా ఉంటున్నాయి. వైట్‌హౌజ్‌లో విందు ఇచ్చే సమయంలోనే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాయి.

ముస్లిం సంఘాలు ఇఫ్తార్ విందును బహిష్కరించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ముస్లింలను అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటామని 2016లో ప్రకటన చేశారు. దాంతో ఆయన ముస్లిం వ్యతిరేకి అని ముద్రపడింది.  ఈ క్రమంలో ట్రంప్ పార్టీని బాయ్ కాట్ చేశాయి ముస్లిం సంఘాలు.
Published by: Shiva Kumar Addula
First published: June 7, 2018, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading