అమెరికాలో పాకిస్థానీలకు ఇక నో ఎంట్రీ ?...పాక్‌పై అమెరికా ఉక్కుపాదం...

సెక్షన్ 243(డి) ఇమ్మిగ్రేషన్ నేషనల్ యాక్ట్ కింద మొత్తం పది దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేసింది.

news18-telugu
Updated: April 27, 2019, 6:17 PM IST
అమెరికాలో పాకిస్థానీలకు ఇక నో ఎంట్రీ ?...పాక్‌పై అమెరికా ఉక్కుపాదం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కఠిన వీసా నిబంధనలు అమలు చేస్తామని అమెరికా విడుదల చేసిన పది దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను కూడా చేర్చింది. దీంతో అమెరికా వెళ్లాలనుకునే పాకిస్థానీలకు రెడ్ సిగ్నల్ పడినట్లయ్యింది. కాగా ఇప్పటికే వీసా గడువు ముగిసి అమెరికాలో నివాసముంటున్న పాకిస్థానీయులను వెనక్కి పిలిపించుకోవాలని అమెరికా చేసిన విన్నపాన్ని, పాకిస్థాన్ తోసిపుచ్చడంతో వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా నిర్ణయం తీసుకోనుంది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్లో వీసాగడువు ముగిసిన పాకిస్థానీల జాబితాను ఇప్పటికే అమెరికా ఇప్పటికే సిద్ధం చేసింది. మరోవైపు ఆయా దేశాల పౌరుల వీసాలను రద్దు చేస్తూ అమెరికా విడుదల చేసిన పది దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరు కూడా నమోదు అయ్యింది. కాగా పాకిస్థాన్ తో పాటు అమెరికా ఘనా, గయానా, గాంబియా, కంబోడియా, ఎరిత్రియా, గినియా, సియెర్రాలియోన్, బర్మా, లావోస్ దేశస్తులను అమెరికాకు రాకుండా వీసాలను రద్దు చేసింది.

అమెరికా జారీ చేసిన సెక్షన్ 243(డి) ఇమ్మిగ్రేషన్ నేషనల్ యాక్ట్ కింద మొత్తం పది దేశాలకు చెందిన పౌరులకు సంబంధించి ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేసింది.

First published: April 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>