జీవితంలో ఒక్కసారైనా అమెరికా (America) వెళ్లాలన్నది ఎంతో మంది కల. అక్కడకు వెళ్లి చదువుకోవడమే కాకుండా ఉద్యోగం సంపాదించి స్థిర పడాలన్నది మరి కొందరి జీవిత కాల కోరిక. గ్రీన్ కార్డు (green card) సంపాదించాలన్నది ఇంకొందరి ప్రధాన లక్ష్యం. అయితే ఇలాంటి వారికోసం ఓ నూతన బిల్లును అమెరికా తీసుకొచ్చింది. ఒకవేళ అది చట్ట రూపం దాల్చితే భారతీయుల (Indian)కు ఓ వరంలా మారనుంది. కొంచెం ఫీజు (limited Fee) చెల్లించే అమెరికాలో శాశ్వత నివాసం (Permanent residency) పొందే వెసులుబాటు రానుంది. యుఎస్‌లో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం కొన్నేళ్లుగా వేచిచూస్తున్న మిలియన్ల మంది ప్రజలకు ఇది ఓ ఆశాకిరణం. ఇక అమెరికాలో ఉంటున్న ఇండియన్ టెకీలకు (Indian IT Professionals) ఐతే ఎంతో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
2 సంవత్సరాల నిబంధన...
గ్రీన్ కార్డును.. అమెరికాలో ఉండేందుకు అధికారిక శాశ్వత నివాస కార్డుగా పిలుస్తారు. వలసదారులకు గ్రీన్ కార్డు జారీ చేస్తే.. వారికి అక్కడ శాశ్వతంగా నివసించేందుకు అధికారికంగా అనుమతి లభించినట్టవుతుంది. ముఖ్యంగా భారతీయ టెక్ నిపుణులు (Indian IT Professionals).. ఈ కార్డు దక్కించుకోని అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని చూస్తుంటారు. వారికి ఈ కొత్త చట్టం ఎంతో మేలు చేకూర్చనుంది. యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జ్యుడీషియరీ కమిటీ విడుదల చేసిన కమిటీ నివేదిక ప్రకారం.. అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి ఒక కొత్త చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం.. ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రెంట్ (employment-based immigrant) దరఖాస్తుదారులు అమెరికాలో 2 సంవత్సరాల నిబంధన (priority date that is more than 2 years before) తో కేవలం 5 వేల డాలర్ల ఫీజు చెల్లించి శాశ్వత నివాసం పొందొచ్చు. అయితే EB-5 కేటగిరీ (వలస పెట్టుబడిదారులు) కోసం రుసుం $ 50,000లుగా నిర్ణయించారు. ఈ నిబంధనలు 2031 వరకు అమల్లో ఉంటాయని ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది.
అయితే అమెరికా పౌరులు స్పాన్సర్ చేస్తే (family-based immigrant who is sponsored by a US citizen) మాత్రం అలాంటి కుటుంబాలకు ఇదే 2 ఏళ్ల నిబంధనతో 2500 డాలర్ల ఫీజు చెల్లించి కార్డు పొందొచ్చు. కాగా, ఈ ఫీజు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ ఫీజుకి అదనం. దీనిని న్యాయవ్యవస్థ కమిటీ (Judiciary Committee), ప్రతినిధుల సభ (the House of Representatives), సెనేట్ (Senate)ను ఆమోదించాలి. అధ్యక్షుడు (president) సంతకం (sign) చేయాలి. అప్పుడు మాత్రమే చట్టం(Law)గా మారుతుంది.
CBS News నివేదిక ప్రకారం.. ఇది ఒకవేళ చట్టం అయితే యుఎస్‌కు వచ్చిన డాక్యుమెంట్ లేని వలసదారులు (undocumented immigrants), తాత్కాలిక రక్షిత స్థితి (Temporary Protected Status) లబ్ధిదారులు, వ్యవసాయ కార్మికులు (farmworkers), ఇతర మహమ్మారి నేపథ్యంలో వచ్చిన కార్మికులు (other pandemic-era essential workers) శాశ్వత యుఎస్ రెసిడెన్సీ లేదా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఏంటీ ఈబీ 5 వీసాలు..
అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం ప్రయత్నిస్తున్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు ప్రధానంగా ‘ఈబీ-5’ వీసాలు కొత్త ఆశలు రేపుతున్నాయి. దశాబ్దాలపాటు అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఇప్పటికీ గ్రీన్‌కార్డును సంపాదించలేని వారి కోసం అమెరికా ఈబీ 5 వీసాలను తీసుకొచ్చింది. ఇది కానీ చట్ట రూపం దాల్చితే ఇక కొత్త ఫీజు చెల్లించే అమెరికాలో గ్రీన్‌కార్డుల వంటి ఈబీ 5 వీసాలను సంపాదించవచ్చు. ఇక పెట్టుబడిదారులకు అమెరికాలో పెట్టుబడి పెట్టి గ్రీన్ కార్డును పొందడానికి అవకాశం కల్పించేదే ఈబీ 5 వీసా. ఈబీ 5 ఇన్వెస్ట్ మెంట్ ప్రోగ్రామ్ కింద అమెరికాలోని రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే కొంతకాలం తర్వాత పెట్టుబడిగా పెట్టిన సొమ్మును తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డును పొందిన ఇన్వెస్టర్లు అమెరికాలో ఇతర పనులు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.